భారతీయ సినిమా పరిశ్రమలో భారీ సినిమాల్లో ఒకటిగా ప్రేక్షకులను అలరించింది కల్కి . ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ విజువల్ వండర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ 2024 జూన్ లో విడుదలై, ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో సినీ ప్రేక్షకుల అందరి దృష్టి ఇప్పుడు సీక్వెల్ పై పడింది. తాజాగా అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ చిత్రబృందం ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ చూడని ఒక సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన కల్కి చిత్రం, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచింది. మొదటి భాగంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ తదితరులు నటించారు. ఒకవైపు మహాభారత నేపథ్యం, మరోవైపు ఫ్యూచర్ ఎలిమెంట్స్ కూడా ఉండడంతో ఆకట్టుకుంది. ఈ సినిమా అద్భుతమైన వసూళ్లతో పాటు, తాజాగా ప్రకటించిన అవార్డుల్లో ఏకంగా రెండు జాతీయ అవార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. దీంతో పార్ట్ 2 పైన అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ తరుణంలోనే చిత్రయూనిట్ సీక్వెల్ కు సంబంధించి ఒక మేజర్ అప్డేట్ ను రివీల్ చేసింది. అక్టోబర్ నెల నుంచి కల్కి 2 రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
కల్కి ఫస్ట్ పార్ట్ లో కేవలం పాత్రల పరిచయం, ఆ ప్రపంచం ఎలా ఉంటుంది అనేది మాత్రమే నాగ్ అశ్విన్ చూపించాడు. అసలు కథ, సుప్రీమ్ యాస్కిన్ వర్సెస్ అశ్వత్థామ, కర్ణుడు.. వీరి మధ్య జరిగే భీకరమైన పోరు రెండో భాగంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు సినిమాకు ఏకంగా రెండు జాతీయ అవార్డులు రావడంతో యూనిట్ లో మరింత జోష్ పెరిగింది. ఆ ఉత్సాహంతోనే రెగ్యులర్ షూటింగ్ ను వీలైనంత త్వరగా పట్టాలెక్కించడానికి మూవీ టీమ్ పక్కాగా స్కెచ్ వేసింది. సీక్వెల్ ప్లానింగ్ గురించి చిత్రబృందం ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. ఈ సీక్వెల్ లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లు మరోసారి అలరించబోతున్నారు. జాతీయ అవార్డులతో పెరిగిన అంచనాల కారణంగా, దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఈ సీక్వెల్ ఇప్పుడు మొదటి స్థానంలో ఉంది.ప్రభాస్ తో పాటు ఇతర కీలక నటీనటులందరూ అక్టోబర్ నుంచి షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు, హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ వర్క్ కు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, ముందస్తుగానే పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగుతున్నారు. విజువల్ వండర్ గా రాబోతున్న ఈ భారీ సీక్వెల్ లో కర్ణుడిగా ప్రభాస్ ఎలాంటి విశ్వరూపం చూపిస్తాడో చూడాలని ఫ్యాన్స్ అంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో అని వారు ఎదురుచూస్తున్నారు.