కబడ్డీలో భారత్‌ కు పసిడి.. టైటిల్‌ను సగర్వంగా నిలబెట్టుకున్న భారత్!

Spread the love

2026 ఆసియా క్రీడల్లో భారత్ కు మరో గోల్డ్ మెడల్ లభించింది. కబడ్డీలో  భారత్‌ అమ్మాయిలు అదరగొట్టడంతో స్వర్ణ పతకం భారత్ ఖాతాలో చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి ఆ స్థాయిని నిలబెట్టుకున్నారు. ఫైనల్ లో ఇరాన్ పై విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో 37-33తో ఇరాన్ ను ఓడించింది. స్వర్ణ పతకం సాధించి, తమ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకున్న భారత మహిళల కబడ్డీ జట్టు మొత్తానికి ప్రముఖులు  అభినందనలు తెలిపారు.

మైదానంలో చురుకైన ఆటతీరుతో భారతీయ క్రీడారంగానికి గర్వకారణమైన ఘనత సాధించింది. ఈ క్రమంలో భారతావనికి ఒక మరపురాని తీపి గుర్తు అని కొనియాడుతున్నారు. తమ సమిష్టి కృషితో క్రీడాభిమానుల గుండెల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో శక్తివంతమైన ఇరాన్ జట్టును భారత మహిళలు మట్టికరిపించారు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌ లో రెండు టీమ్ లు పాయింట్ల కోసం తీవ్రంగా పోరాడాయి. అయితే, మ్యాచ్ కీలక ఘట్టంలో భారత క్రీడాకారిణులు చూపిన ధైర్యం, సమయస్ఫూర్తితో 37-33 తేడాతో ఇరాన్‌పై అద్భుత విజయాన్ని సాధించి గోల్డ్ మెడల్  కైవసం చేసుకున్నారు.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టుపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆడారు.  కబడ్డీ మైదానంలో భారత జట్టు చూపిన క్రమశిక్షణ, వ్యూహాత్మక ఆటతీరు మరియు పట్టుదల అభినందనీయం. రైడింగ్‌ లో పాయింట్లు సాధించడంలో ఎంతటి నైపుణ్యం చూపారో, డిఫెన్స్ లో కూడా  ప్రత్యర్థి రైడర్లను అడ్డుకోవడంలో అంతటి సమన్వయాన్ని ప్రదర్శించారు. పక్కా ప్రణాళికలతో మైదానంలోకి దిగి ప్రత్యర్థుల వ్యూహాలను సమర్థవంతంగా తిప్పికొట్టారు.

ఆసియా కబడ్డీలో ఇరాన్ ఎప్పుడూ బలమైన ప్రత్యర్థి జట్టు. అలాంటి కఠినమైన జట్టుతో ఫైనల్ పోరులో ఒత్తిడిని అధిగమించి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, పాయింట్ పాయింట్‌కూ పోరాడి ఇరాన్‌ పై గెలుపు ప్రశంసనీయం. అందుకే భారత మహిళల కబడ్డీ జట్టు సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు క్రీడా దిగ్గజాలు జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మైదానంలో మన అమ్మాయిలు ప్రదర్శించిన పోరాట పటిమ యావత్ భారతావనికి గర్వకారణమని కొనియాడారు. వారు సాధించిన ఈ గెలుపు కేవలం మెడల్ గానే కాకుండా దేశంలో మహిళా క్రీడల పురోగతికి కొత్త ఊపిరి పోసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడల్లోకి రావాలనుకుంటున్న ఎంతోమంది యువతులకు ఈ విజయం గొప్ప స్ఫూర్తిని నింపుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  భారత్‌లో కబడ్డీ క్రీడకు ఉన్న ఆదరణను, స్థాయిని ఇది సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *