దీనిని బద్దలు కొట్టాల్సిన సమయం వచ్చింది:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

Spread the love

మన దేశవ్యాప్తంగా మహిళలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారని లైంగిక వేధింపులు, అత్యాచారాలకు గురవుతామేమోనని ఆందోళన చెందుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. . దీనికి ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఇంట్లోనే కూర్చోండి.ఇది పితృస్వామ్య వ్యవస్థ పనితీరుకు నిదర్శనమని మండిపడ్డారు. బాధితులనే తప్పుబడుతూ, నేరస్థులకు రక్షణ కల్పించే వ్యవస్థ ఇదని ఆరోపించారు.  దీనిని బద్దలు కొట్టాల్సిన సమయం వచ్చింది. మహిళలపై జరుగుతున్న నేరాలకు వారినే శిక్షించడం ఇకనైనా ఆపండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఇళ్లలోనే బంధించడం దీనికి పరిష్కారం కాదు. మన వీధులను సురక్షితంగా మార్చడం, మహిళల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించే పురుషుల మనస్తత్వాన్ని నిలదీయడం, మరియు దాడులకు పాల్పడే వారిపై కఠినంగా  త్వరితగతిన శిక్షించడమే నిజమైన పరిష్కారమని అన్నారు.మహిళల భద్రతను డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మరింత మంది యువతులు, ముఖ్యంగా ‘జెన్ జీ’ (Gen Z) యువత ఇంకా పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని రాహుల్ కోరారు. ఈ ప్రభుత్వం మీ వేదన పట్ల చెవిటిదానిలా వ్యవహరిస్తోంది; తీవ్రమైన ఒత్తిడి తెచ్చినప్పుడు మాత్రమే ఇది వింటుందని యువతనుద్దేశించి అన్నారు. శాంతియుతంగా నిరసన తెలపడం మీ ప్రజాస్వామ్య హక్కు, ఈ పోరాటంలో నేను మీకు మనస్ఫూర్తిగా తోడుగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా మహిళల భద్రతను కోరుతూ యువత, విద్యార్థినులు రోడ్డెక్కి చేస్తున్న శాంతియుత నిరసనలకు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని, మహిళల స్వేచ్ఛను హక్కుగా కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.  మహిళల భద్రత, రక్షణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణుల నుండి మద్దతు లభిస్తోంది. ఇటీవల పూణేలో జరిగిన కార్యక్రమంలో మరియు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మహిళలను అణచివేసే పితృస్వామ్య వ్యవస్థను, మనుస్మృతి భావజాలాన్ని ఆయన తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *