బాక్సింగ్…షూటింగ్..ఏదైనా హవా మనదే

Spread the love

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్లు మెడల్స్ తో సత్తా చాటారు. తమ పంచ్ పవర్‌తో ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ, మెరుపు వేగం, పక్కా వ్యూహాలతో బాక్సింగ్ రింగ్‌ లో ఆదిపత్యం కనబరిచారు. ఈ క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరవేశారు.లవ్లీనా బోర్గో హెయిన్, ప్రియా ఘంఘాస్, కపిల్ ఫోఖరియా సెమీ ఫైనల్ చేరడంతో దేశానికి మూడు మెడల్స్  ఖాయమయ్యాయి. మహిళల క్వార్టర్ ఫైనల్ లవ్లీనా (75 కేజీ) 5-0తో సౌత్  కొరియాకు చెందిన సియాంగ్ సూయాన్ పై  విజయం సాధించింది. గత క్రీడల్లో లవ్లీనా సిల్వర్ తో అదరగొట్టింది. మరో క్వార్టర్స్ లో  ప్రియా (60కేజీ) 5-0తో తజకిస్థాన్ కు చెందిన మిజోనా సమదోవా పై విజయం సాధించింది. పురుషుల 90కేజీ క్వార్టర్స్ కపిల్ 5-0తో సౌత్ కొరియాపై కిమ్ గిక్చే పై గెలిచాడు. అటు షూటింగ్ లో కూడా భారత్ హవా చూపించింది. 10వ రోజు సిల్వర్ తో ఓపెన్ చేసింది. మహిళల ట్రాప్ షూటింగ్ ఫైనల్లో నీరూదండా, ఆషిమా అహ్లావత్, మనీషా కీర్ బృందం రెండోస్థానంలో నిలిచింది. 346 పాయింట్లతో చైనా టీమ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్ కు  328 పాయింట్లు వచ్చాయి. ఆసియా క్రీడల మెడల్స్ టేబుల్ లో భారత్ 12వ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 4 గోల్డ్ మెడల్స్, 21 సిల్వర్, 21 బ్రాంజ్ మెడల్స్ దక్కించుకుంది. షూటింగ్ లో బాక్సింగ్ లో రాణిస్తూ భారత క్రీడాకారులు రాణించడంతో భారత అభిమానుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారతీయ క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరుస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా షూటింగ్, బాక్సింగ్ విభాగాల్లో మన అథ్లెట్లు చూపుతున్న ఆధిపత్యానికి, కనబరుస్తున్న క్రమశిక్షణకు భారత అభిమానులు హార్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచస్థాయి టోర్నమెంట్లలో కఠినమైన ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొంటూ మెడల్స్ సాధిస్తున్న మన క్రీడాకారులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. షూటింగ్ విభాగంలో భారత షూటర్లు సాధిస్తున్న విజయాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ విజయాలు దేశంలోని ఎంతోమంది యువతకు షూటింగ్ క్రీడ పట్ల ఆసక్తి పెరిగేలా చేస్తున్నాయి.. పురుషుల విభాగంలోనే కాకుండా, మహిళా బాక్సర్లు కూడా అసాధారణమైన పంచ్‌లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, ఏ దశలోనూ తగ్గకుండా పతకాలను కైవసం  చేసుకుంటున్నారు. మన క్రీడాకారుల ఈ వరుస విజయాలపై సోషల్ మీడియా వ్యాప్తంగా అభిమానులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల నుండి లభిస్తున్న ఈ అపారమైన మద్దతు మరియు ప్రోత్సాహం క్రీడాకారుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. రాబోయే ఒలింపిక్స్ మరియు ఇతర ప్రతిష్టాత్మక టోర్నీలలో భారత్ మరిన్ని మెడల్స్ తో సత్తా చాటాలని కోరుకుంటున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *