ఉక్రెయిన్ ను వణికిస్తున్న రష్యా సరికొత్త వెపన్ గెరాన్-5

Spread the love

ఆధునిక ప్రపంచ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. అమెరికా, నాటో దేశాలు అండగా నిలబడి వేల కోట్ల రూపాయల ఆయుధాలను ఇస్తున్నాయి. అయితే  ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం రష్యా దాడులను పూర్తిగా నిలువరించలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం రష్యా ఎప్పటికప్పుడు తన యుద్ధ వ్యూహాలను మార్చడమే.  మొన్నటి వరకు శీతాకాలంలో మిస్సైల్ ఎటాక్స్  చేసిన రష్యా.. ఆ తర్వాత గ్లైడ్ బాంబులను వాడింది. ఇక ఇప్పుడు  ఒక సరికొత్త అస్త్రం ఉక్రెయిన్ మిలిటరీకి కొరకరాని కొయ్యలా మారింది. అదే గెరాన్-5 జెట్ డ్రోన్.  సాధారణంగా మిగితా డ్రోన్ల మాదిరిగానే  వీటిని  యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ తో ఈజీగా గాల్లోనే పేల్చేయొచ్చు అని ఉక్రెయిన్ సైన్యం భావించింది. కానీ రష్యా ప్రయోగిస్తున్న ఈ గెరాన్-5 డ్రోన్ల ముందు అమెరికా ఇచ్చిన అత్యంత ఖరీదైన ప్యాట్రియాట్  లాంటి వాయు రక్షణ వ్యవస్థలు కూడా నిలవలేకపోవడం గమనార్హం. ఆగస్టు నెల నుంచి రష్యా ఈ డ్రోన్లను ఉక్రెయిన్ పైకి పెద్ద ఎత్తున ప్రయోగిస్తోంది. ఈ డ్రోన్ ఫీచర్లు వింటే పాశ్చాత్య దేశాల మిలిటరీ నిపుణులు సైతం ఆశ్చర్యపోవాల్సిందే. ఈ డ్రోన్ ఏకంగా జెట్ ఇంజిన్ తో పనిచేస్తుంది.  ఇది గంటకు 600 కిలోమీటర్ల  రాకెట్ వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ఒక అత్యాధునిక జెట్ విమానం వెళ్లినంత వేగంగా లక్ష్యం వైపు దూసుకుపోతుంది. దీని రేంజ్ కూడా చాలా ఎక్కువ. రష్యా సరిహద్దుల్లో ఎక్కడో ప్రయోగించినా, దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో, ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని టార్గెట్లను కూడా ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. గెరాన్-5 డ్రోన్  జెట్ ఇంజిన్ కెపాసిటీ కారణంగా ఇది భూమికి ఏకంగా 6,000 మీటర్ల ఎత్తు వరకు దాదాపు 19,600 అడుగులు వరకు ఎగరగలదు. ఇంత ఎత్తులో, ఇంత స్పీడ్ గా వెళ్లే డ్రోన్లను ఉక్రెయిన్ వద్ద ఉన్న ఏ చిన్నపాటి మిస్సైల్స్ తో గానీ, యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ తుపాకులతో గానీ కూల్చడం దాదాపు అసాధ్యం. రష్యా ప్రయోగిస్తున్న ఈ డ్రోన్ల వెనుక ఉన్న అసలైన మాస్టర్ మైండ్ ఉక్రెయిన్ ను ఆర్థికంగా దెబ్బతీయడం, వాళ్ళ దగ్గర ఉన్న ఖరీదైన క్షిపణుల స్టాక్ ను తగ్గించడం. ఇంకొక కీలక అంశం. ఉక్రెయిన్ ఈ వెపన్ ను కూల్చడానికి అయ్యే ఖర్చు రష్యా డ్రోన్ తయారు చేసే ఖర్చు కంటే ఎక్కువ.  గెరాన్-5 ఎత్తులో ఎగురుతుండటం వల్ల, దాన్ని కూల్చడానికి ఉక్రెయిన్ తప్పనిసరి పరిస్థితుల్లో  ఏకంగా ఎఫ్-16 , మిగ్-29 లాంటి ఫైటర్ జెట్స్ ను గాల్లోకి పంపాల్సి వస్తోంది.ఇలా ఫైటర్ జెట్స్ తో డ్రోన్లను కూల్చే క్రమంలో మొన్నటికి మొన్న ఒక ఎఫ్-16 విమానం కూడా క్రాష్ అయింది. మరోవైపు అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్ కు క్షిపణులను సప్లై చేయలేక చేతులెత్తేస్తున్నాయి. ఆయుధ నిల్వలు లేక ఉక్రెయిన్ సతమతమవుతుంటే, రష్యా మాత్రం రోజుకో కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఈ యుద్ధంలో తన పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *