
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్, డబుల్ ఇస్మార్ట్ రెండు డిజాస్టర్స్ తర్వాత నెక్ట్స్ మూవీ చేయడం కోసం చాలా కష్టపడ్డాడు. కొంత మంది స్టార్ హీరోలతో సినిమా చేయాలని ట్రై చేసినప్పటికీ వర్కవుట్ కాలేదు. అయితే.. ఊహించని విధంగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో సినిమాని అనౌన్స్ చేసి అందర్నీ సర్ ఫ్రైజ్ చేశాడు. జూన్ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇందులో టాలీవుడ్ స్టార్ నటిస్తున్నాడని ఓ వార్త లీకైంది. ఇంతకీ.. ఈ క్రేజీ మూవీలో నటించే టాలీవుడ్ స్టార్ ఎవరు..? అసలు ఇది నిజమేనా..? లేక గాసిప్పా..?
ఈ భారీ పాన్ ఇండియా మూవీకి బెగ్గర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్ గురించి ఇటీవల విజయ్ సేతుపతిని అడిగితే.. మీడియానే బెగ్గర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసేసింది అన్నారు కానీ.. అసలు టైటిల్ ఇదేనా..? కాదా..? అనేది మాత్రం చెప్పలేదు. ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, మరో హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందంటున్నారు. అయితే.. ఆ పాత్ర కోసం పూరి బాలీవుడ్ భామను రంగంలోకి దింపనున్నారని తెలుస్తోంది. పూరి తన రూటు మార్చి రాసిన కథ ఇదని టాక్ వినిపిస్తోంది. ఈ కథ నచ్చడం వలనే విజయ్ సేతుపతి పూరితో సినిమాకి ఓకే చెప్పారని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందట. ఆ గెస్ట్ రోల్ ను టాలీవుడ్ కింగ్ నాగార్జునతో చేయించాలి అనుకుంటున్నాడట పూరి. నాగ్, పూరి కలిసి శివమణి, సూపర్ సినిమాలు చేశారు. ఆ రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఆతర్వాత ఇంత వరకు మరో సినిమా చేయలేదు. ఈమధ్య వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయనున్నట్టుగా ప్రచారం జరిగింది కానీ.. అనౌన్స్ మెంట్ అయితే మాత్రం రాలేదు. నాగ్, పూరి కాంబోలో ఖచ్చితంగా సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రచారంలో ఉన్నట్టుగా విజయ్ సేతుపతి మూవీలో నాగ్ గెస్ట్ రోల్ చేస్తే మరింత క్రేజ్ పెరగడం ఖాయం.