
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఈ ఇద్దరి కాంబోలో స్పిరిట్ అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రేజీ మూవీ ఎప్పుడో సెట్స్ పైకి రావాలి కానీ.. ప్రభాస్ బిజీగా ఉండడం వలన లేట్ అయ్యింది. అయితే.. ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా దీపికను తీసుకోవాలి అనుకున్నాడు సందీప్. కథ చెబితే నచ్చి సినిమా చేయడానికి ఓకే చెప్పిందట. ఆతర్వాత దీపిక రోజుకో డిమాండ్ సందీప్ ముందు పెట్టడంతో ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించాడు. ఇక అక్కడ నుంచి దీపిక వెర్సెస్ సందీప్ అనేట్టుగా తయారైంది పరిస్థితి. అయితే.. దీపిక సందీప్ అదిరిపోయే కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. దీపిక ఏమంది..? సందీప్ ఏమని కౌంటర్ ఇచ్చాడు..?
ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిన తర్వాత దీపిక.. ఈ సినిమా ప్రాఫిట్స్ లో వాటా కావాలి.. తన స్టాఫ్ సాలరీలు అన్నీ ప్రొడ్యూసరే ఇవ్వాలి. వర్కింగ్ అవర్స్ 6 గంటలే ఉండాలి.. ఇలా రోజుకో కండీషన్ పెడుతుందట. ఇది నచ్చక సందీప్ ఈ ప్రాజెక్ట్ నుంచి దీపికను తప్పించి త్రిప్తి డిమ్రీని కథానాయికగా ఫైనల్ చేశాడు. అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇక అక్కడ నుంచి దీపిక తన పీఆర్ టీమ్ తో.. సినిమా గురించి నెగిటివ్ గా స్టోరీస్ రాయిస్తున్నారు. ఇందులో ఏ రేటెడ్ సీన్లు ఉండడం వలన దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుందని.. సందీప్ అన్ ఫ్రొఫెషనల్ అని బాలీవుడ్ మీడియాలో స్టోరీస్ వస్తున్నాయి.
తన పీఆర్ టీమ్ తో నెగిటివ్ గా ప్రచారం చేయిస్తున్న దీపికకు సందీప్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. తాను ఒక ఆర్టిస్టుకు కథ చెప్పానంటే అది పూర్తి నమ్మకంతోనే చేస్తానని.. కానీ ఆ కథను బయటపెట్టేయడం ద్వారా ఆ వ్యక్తి స్వభావం ఎలాంటిదో తెలిసిందన్నాడు. తన కథను బయటపెట్టేయడమే కాక, ఒక యంగ్ యాక్టర్‌ను తక్కువ చేయడం గురించి ప్రస్తావిస్తూ.. ఇదేనా ఫెమినిజం అని ప్రశ్నించాడు సందీప్. ఒక సినిమా కోసం ఏళ్లు కష్టపడతామని చెబుతూ.. ఫిలిం మేకింగే తనకు అన్నీ అని.. అది ఆ వ్యక్తికి ఎప్పటికీ అర్థం కాదని సందీప్ అన్నాడు. మొత్తం కథను బయటపెట్టేసినా తనకు పోయేదేమీ లేదన్న సందీప్.. డర్టీ పీఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా పెట్టాడు. ఇది దీపికను ఉద్దేశించేది అనేది అందరికీ అర్ధమైంది. దీంతో దీపిక పైన, బాలీవుడ్ పీఆర్ మాఫియా పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో సందీప్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి.. దీపిక ఎలా స్పందిస్తుందో చూడాలి.