రవితేజను టెన్షన్ పెడుతున్న ఆ సెంటిమెంట్..?

Spread the love

మాస్ మహారాజా రవితేజ కథ నచ్చితే చాలు.. ఆ డైరెక్టర్ సక్సెస్ లో ఉన్నాడా..? ఫెయిల్యూర్ లో ఉన్నాడా..? అనేది చూడడు. అలాగే కథ ఒకసారి ఓకే చేసిన తర్వాత షూటింగ్ లో ఇన్ వాల్వ్ అవ్వరు. ఎంత తక్కువ రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేస్తానంటే.. అంత త్వరగా డేట్స్ ఇస్తాడనే పేరు ఉంది ఈ మాస్ రాజాకి. అయితే.. ఈ మాస్ రాజాకి ఓ సెంటిమెంట్ ఈమధ్య బాగా టెన్షన్ పెడుతుందని ఓ వార్త ప్రచారం జరుగుతోంది. ఇంతకీ.. ఆ సెంటిమెంట్ ఏంటి..? మాస్ రాజా టెన్షన్ పడడానికి కారణం ఏంటి..?

మాస్ మహారాజా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నటించిన మూవీ ఈగల్. ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్. ఈ సినిమాను 2024లో సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. చాలా గట్టిగా ప్రయత్నం చేశారు కానీ.. కుదరలేదు. 2024లో ఫిబ్రవరి 9న ఈగల్ మూవీ రిలీజ్ అయ్యింది. ఆతర్వాత రవితేజ మరోసారి సంక్రాంతికి తన సినిమాను విడుదల చేయాలి అనుకున్నాడు. అదే.. మాస్ జాతర. ఈ సినిమాకి భోగవరపు భాను డైరెక్టర్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీని సంక్రాంతికి 2025లో సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు అయితే.. రవితేజకు ఈ మూవీ షూటింగ్ లో యాక్సిడెంట్ అవ్వడం వలన కుదరలేదు.

సంక్రాంతికి కుదరకపోవడంతో ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ అదే తేదీకి పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో అందరూ ఊహించినట్లుగానే రవితేజ సినిమా వెనక్కి వెళ్ళింది. వీరమల్లు కూడా అనుకున్న సమయానికి రాలేదు. లేటెస్టుగా సితార టీమ్ కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేసారు. మాస్ జాతర సినిమాని ఆగస్ట్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు 27న వినాయక చవితి ఫెస్టివల్ ఉంది. హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు గ్యారంటీ అని చెప్పచ్చు.

ఈగల్, మాస్ జాతర సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకోవడం.. కుదరపోవడం తెలిసిందే. తాజాగా రవితేజ మరోసారి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ భారీ ఎంటర్ టైనర్ ని సంక్రాంతికి విడుదల అంటూ ఒక ప్రీ లుక్ పోస్టర్ తో అధికారికంగా ప్రకటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఆడవాళ్ళూ మీకు జోహార్లు తర్వాత కిషోర్ తిరుమల చేస్తున్న మూవీ ఇదే. అయితే.. రెండు సార్లు సంక్రాంతికి రావాలని ప్లాన్ చేసి కుదరకపోవడంతో ఈసారి ఎలాగైనా సరే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని రవితేజ పట్టుదలగా ఉన్నారట. మరి.. ఈసారైనా రవితేజ ప్లాన్ ఫలిస్తుందా..? సంక్రాంతికి సినిమా వస్తుందా..? లేదా..? అనేది చూడాలి.