అమీర్ ఖాన్ తో లోకేష్‌ సినిమా! ఈ అప్డేట్స్ చూస్తే సూపర్ అనాల్సిందే!

Spread the love

లోకేష్‌ కనకరాజ్.. వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తున్న సెన్సేషనల్ డైరెక్టర్. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబోలో కూలీ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆగష్టు 14న కూలీ మూవీ రిలీజ్ కానుంది. అయితే.. లోకేష్‌ కనకరాజ్.. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో సినిమా చేయబోతున్నట్టుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో మూవీ గురించి క్లారిటీ వచ్చింది. లోకేష్‌ కనకరాజ్ తో మూవీ గురించి అమీర్ ఖాన్ ని అడిగితే.. ఈ సినిమాతో పాటు తన సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ డీటైల్స్ బయటపెట్టారు. ఇంతకీ.. అమీర్ ఖాన్ ఏం చెప్పారు..?

లోకేష్‌ కనకరాజ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న కూలీ సినిమాలో అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని చాన్నాళ్లు సస్పెన్స్ గా ఉంచారు. అయితే.. అమీర్ ఖాన్, లోకేష్‌ కనకరాజ్ కాంబో మూవీ అనగానే కూలీ సినిమానే అనుకున్నారు కానీ.. వీరిద్దరి కాంబోలో సినిమా కన్ ఫర్మ్ అయ్యిందని టాక్ వినిపించింది. ఇప్పుడు ఇదే విషయం గురించి అమీర్ ఖాన్ ను అడిగితే.. అసలు విషయం బయటపెట్టారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. లోకేష్‌ కనకరాజ్ తో సినిమా చేస్తున్నానని.. ప్రస్తుతం ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నామని చెప్పారు అమీర్ ఖాన్.

ఇది సూపర్ హీరో మూవీ అని.. భారీ యాక్షన్ ఉంటుదని.. వచ్చే సంవత్సరం జూన్ నుంచి ఈ సినిమాని పట్టాలెక్కించాలి అనుకుంటున్నామని చెప్పారు. అంతకు మించి ఈ సినిమా గురించి ఏమీ చెప్పలేనని.. రెండు సంవత్సరాల తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం అన్నారు. అలాగే అమీర్ ఖాన్ పీకే 2 కూడా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా గురించి అడిగితే.. అలాంటి ఆలోచనలేదని.. అది కేవలం ప్రచారం మాత్రమే అని తేల్చేశారు అమీర్ ఖాన్. ఇటీవల అమీర్ ఖాన్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీని గురించి అమీర్ ను అడిగితే.. రాజా హిరాణీతో అదే సినిమా వర్క్ లో బిజీగా ఉన్నామని చెప్పారు.

ఇక మహా భారతం గురించి అడిగితే.. అది 25 ఏళ్ల డ్రీమ్ అని.. ఈ సినిమా చేయాలని తపిస్తున్నానని.. అది సినిమా కాదు.. ఒక తపస్సులా.. ఒక యజ్ఞంలా చేయాలి అన్నారు. ఈ సినిమాని మూడు పార్టులుగా తీయాలి అనుకుంటున్నానని.. ఒక్కో పార్ట్ ని ఒక్కో డైరెక్టర్ తెరకెక్కిస్తాడని.. ఇందులో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించనున్నారని టాక్ వినిపించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు కూడా వినిపించింది. ఇటీవల అమీర్ ఖాన్ తో అల్లు అర్జున్ కలిసింది దీని కోసమే అని వార్తలు వచ్చాయి. అయితే.. తన కల నెరవేరుతుందో లేదో చూడాలని అమీర్ ఖాన్ అనడం ఆసక్తిగా మారింది.