
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ క్రేజీ కాంబోలో రూపొందుతోన్న మూవీ కూలీ. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ మూవీకి డైరెక్టర్. ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియోతోనే అంచనాలు పెంచేసింది. ఈ భారీ క్రేజీ మూవీని ఆగష్టు 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అయితే.. ఇదే డేట్ కి టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 కూడా విడుదలకు రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాలు ఓకే రోజున వచ్చేందుకు రెడీ అవుతుండడం హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలా ఉంటే.. కూలీని వార్ 2 టెన్షన్ పెడుతుందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఏ విషయంలో వార్ 2.. కూలీని టెన్షన్ పెడుతుంది..?
రజినీ, నాగ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శృతిహాసన్.. ఇలా భారీ తారాగణంతో.. భారీ బడ్జెట్ తో.. రూపొందుతోన్న కూలీ మూవీ నుంచి ఇక సరైన ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాలేదు. అయినప్పటికీ.. అంచనాలు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమా పై ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ దృష్టి పెట్టుకుని తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ భారీగా ఉంది. ఈ మూవీ కోసం నాగవంశీ, దిల్ రాజు, ఏసియన్ సునీల్, నాగార్జున పోటీపడుతున్నారు. ఈ మూవీ రైట్స్ కోసం హయ్యస్ట్ 43 కోట్లు కోట్ చేసారని ఇండస్ట్రీలో వినిపించింది. అయితే.. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ ను చూసి మరింత రేటు పెంచేస్తున్నారట మేకర్స్.
ఇక వార్ 2 విషయానికి వస్తే.. సౌత్ హీరో ఎన్టీఆర్, నార్త్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించడం.. ఎన్టీఆర్ ఫస్ట్ స్ట్రైయిట్ హిందీ మూవీ కావడంతో వార్ 2 పై తెలుగు రాష్ట్రాల్లో మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాను బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. అయితే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మూవీకి 120 కోట్లు కోట్ చేశారట. ఆతర్వాత ఏమైంది ఏమో కానీ.. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ మూవీని అమ్మకుండా ఓన్ గా రిలీజ్ చేయాలి అనుకుంటుందట. అందుకనే.. డైరెక్ట్ గా ముంబాయి నుంచే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల ఓనర్స్ తో మాట్లాడి అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారని సమాచారం.
ఆగష్టు 14న వార్ 2 మూవీ రిలీజ్. ఇంకా రెండు నెలలు టైమ్ ఉంది. అయినప్పటికీ.. అదే రోజున కూలీ మూవీ వస్తుండడం.. పోటీ గట్టిగా ఉండడంతో ఇప్పటి నుంచే థియేటర్స్ ను లాక్ చేస్తున్నారు వార్ 2 మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో కూలీ మూవీకి భారీగా క్రేజ్ ఉంది. అందుకనే వార్ 2 మేకర్స్ థియేటర్స్ ను బ్లాక్ చేస్తున్నారు. ఇలా వార్ 2 రెండు నెలల నుంచే థియేటర్స్ తో అగ్రిమెంట్స్ చేసుకుంటుండడం కూలీ మేకర్స్ ని టెన్షన్ పెడుతుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి వార్ 2 ఆగష్టు 14న రావడం పక్కా అని తెలుస్తోంది. మరి.. కూలీ ఆగష్టు 14న వస్తుందా..? రిలీజ్ డేట్ మార్చుకుంటుందా..? అసలు కూలీ మేకర్స్ ప్లాన్ ఏంటి అనేది తెలియాల్సివుంది.