షారుఖ్ తో సుకుమార్.? అసలు నిజం ఇదే..!

Spread the love

పుష్ప.. పుష్ప రాజ్ తగ్గేదేలే.. అంటూ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందే. ఈ మూవీతో ఒక్కసారిగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. దీంతో టాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాదు.. బాలీవుడ్ స్టార్స్ కూడా సుకుమార్ తో సినిమా చేయడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆమధ్య బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో సుకుమార్ మూవీ అంటూ ప్రచారం జరిగింది. ఆతర్వాత అలాంటిది ఏమీ లేదు.. ఇదేదో గాసిప్ అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో గురించి వార్తలు వస్తున్నాయి. అసలు ఈ వార్తలు వెనకున్న నిజం ఏంటి..?

షారుఖ్ ఖాన్, సుకుమార్ కాంబోని సెట్ చేయాలని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తుందని తెలిసింది. ఆ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈ సంస్థతో సుకుమార్ కు మంచి అనుబంధం ఉంది. ఈ భారీ నిర్మాణ సంస్థ షారుఖ్ ఖాన్ తో సినిమా నిర్మించాలి అనుకుంటుందట. షారుఖ్ కనుక ఈ సంస్థలో సినిమా చేయడానికి ఓకే చెబితే.. సుకుమార్ ని రంగంలోకి దింపాలనేది ప్లాన్. ఇదే విషయం షారుఖ్ కి చెబితే పాజిటివ్ గా స్పందించారని తెలిసింది. ఈ వార్త లీక్ అవ్వడం వలనే ఈ క్రేజీ కాంబో మూవీ ఫిక్స్ అంటూ ఆమధ్య బాలీవుడ్, టాలీవుడ్ లో ప్రచారం జరిగింది.

మరో వైపు షారుఖ్ ఖాన్ కు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ ఓ కథ చెప్పారట. ఈ కథతో సినిమా చేయాలా..? వద్దా..? అనేది షారుఖ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ప్రస్తుతం షారుఖ్ కింగ్ అనే సినిమా చేసేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. ఇక సుకుమార్ విషయానికి వస్తే.. పుష్ప 2 తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయనున్నట్టుగా ప్రకటించారు. గతంలో చరణ్‌, సుకుమార్ ఇద్దరూ కలిసి రంగస్థలం సినిమా చేయడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. దీంతో ఇప్పుడు మరోసారి రంగస్థలం కాంబోలో సినిమా అనగానే మరింత క్రేజ్ ఏర్పడింది.

ఇదిలా ఉంటే.. షారుఖ్, సుకుమార్ కాంబో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించాలి అనుకుంటుందట. ఈ నిర్మాణ సంస్థ తెలుగులోనే కాకుండా వేరే భాషల్లో కూడా సినిమాలు తీయాలి అనుకుంటుంది. తమిళ్ లో అజిత్ తో సినిమా చేసింది. ఇప్పుడు రజనీతో మూవీ ప్లాన్ చేస్తుంది. అలాగే అమీర్ ఖాన్, లోకేష్‌ కాంబో మూవీని కూడా ప్లాన్ చేస్తుందని తెలిసింది. ఇప్పుడు షారుఖ్, సుకుమార్ కాంబో మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించాలి అనుకుంటుందట. మొత్తానికి మైత్రీ భారీగానే ప్లాన్ చేస్తుంది. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ క్రేజీ కాంబో సెట్ అయితే.. సంచలనమే.