కఠినమైన వ్రతాన్ని స్వీకరించిన రామ్ చరణ్ సతీమణి ఉపాసన

Spread the love

Upasana Kamineni Konidela గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాజాగా తన ఇష్ట దైవం గురించి, తాను ఆచరించే వ్రతం గురించి చెప్పుకొచ్చారు. కొన్ని సార్లు జీవితంలో ఏం చేయాలో అర్థం కాదని, ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు, కష్టాలు వస్తాయని అలాంటప్పుడు మనం దేవుడి మీద భారం వేసి, నమ్మకంతో ఆరాధిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని స్వీయ అనుభవం గురించి ఉపాసన తెలిపారు.

ఆధ్యాత్మికత, ఆనందం కోసం వ్రతాన్ని ఆచరిస్తునట్టు ఉపాసన ప్రకటించారు. ఈ గురు పూర్ణిమకు తాను తొమ్మిది వారాల సాయిబాబా వ్రతాన్ని ప్రారంభిస్తున్నానని అభిమానులతో పంచుకున్నారు. తాజాగా సాయిబాబా గురించి వీడియో షేర్ చేశారు. ‘‘నా జీవితంలో ఒక దశలో నేను చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నాను. నా మనసు కొంత కలవరపడింది. అప్పుడు నాకు కొంతమంది సాయిబాబా వ్రతాన్ని పాటించాలని సలహా ఇచ్చారు. సాయిబాబా కథను చదవడం ప్రారంభించినప్పుడు.. నా జీవితంలో మార్పులు మొదలయ్యాయి. నేను మరింత సానుకూలంగా ఆలోచించడం ప్రారంభించాను. నా చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సానుకూలంగా మారడం గమనించాను. ఈ చిన్న చిన్న మార్పులు నన్ను మరింత మంచి వ్యక్తిగా మార్చాయని గ్రహించాను. అందుకే ఈ వ్రతం నాకు ఎంతో ప్రత్యేకం.’’ అని చెప్పుకొచ్చారు.

అయితే ఈ వ్రతం కఠినంగా ఉంటుందట. తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని ఆచరించాలి. 9 గురువారాలు మందిరానికి వెళ్లి ప్రార్థించాలి. వ్రతం పూర్తి అయ్యాక షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకోవాలి. అలాగే బీదలకు అన్నదానం చేయాలి. 5 లేదా 11 మందికి వ్రత పుస్తకాలను కూడా ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి వ్రతాన్ని మెగా కోడలు పాటించడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. Upasana Kamineni Konidela