బాబ్జీ డైరెక్షన్‌లో ‘పోలీస్ వారి హెచ్చరిక’.. గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్

Spread the love

Police Vari Hechcharika Trailer అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన చిత్రం “పోలీస్ వారి హెచ్చరిక”. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్‌గా పనిచేయగా గజ్వేల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

నటి ఇంద్రజ మాట్లాడుతూ… “నేను ఈ ఈవెంట్ కు బాబ్జి గారి కోసం ఈ కార్యక్రమానికి వచ్చాను. నా ప్రతి పుట్టిన రోజుకు నన్ను విష్ చేసే సుధాకర్ గారికి ధన్యవాదాలు. జనార్ధన్ గారికి ఈ సినిమాతో మంచి విజయం రావాలి అని కోరుకుంటున్నాను.” అన్నారు.

నటుడు శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ… “సాధారణంగా చిన్ననాటి నుండి మనల్ని పెద్దవారు ఏదో ఒక విషయంలో హెచ్చరిస్తూ ఉంటారు. దానిని మనం మంచికి తీసుకుని ముందుకు వెళ్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. పోలీసు వారు ఏదైనా హెచ్చరించినప్పుడు దానిని పాటిస్తే అది మనకే మంచిది. ఈ సినిమాలో అన్ని కోణాలు ఉన్నాయి.” అన్నారు.

నిర్మాత బెల్లి జనార్ధన్ మాట్లాడుతూ… “నేను జీవితంలో ముగ్గురిని నమ్ముకున్నాను. తల్లిదండ్రులను, భారతదేశాన్ని.. అలాగే ఇప్పుడు కళామతల్లిని. నేడు నన్ను కళామతల్లి నిలబెడుతుంది అని నమ్ముతున్నాను. జూలై 18వ తేదీన సినిమాలు అందరూ చూసి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు బాబ్జి మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కారం. సినిమాల కోసం పనిచేసేవారు తాము చేసిన సినిమా విడుదలైన ప్రతిసారి పుడుతూనే ఉంటారు. సినిమా కోసమే పుట్టామని భావిస్తాము. జూలై 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తుంది. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను” అంటూ ముగించారు. Police Vari Hechcharika Trailer