
VI Finance: వొడాఫోన్ ఐడియా, వీఐ ఫైనాన్స్ పేరిట ఇప్పుడు ఒక సరికొత్త ప్లాట్ ఫామ్‌ను తీసుకొచ్చింది. ఈ సేవలను సంబంధిత వీఐ యాప్‌లోనే పొందవచ్చు. పర్సనల్ లోన్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్, క్రెడిట్ కార్డ్స్ వంటి ఫెసిలిటీస్‌ను అందిస్తోంది. వీఐ యాప్ ద్వారా ఇప్పటికే బిల్ పేమెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్, షాపింగ్ లాంటి సర్వీసులను పొందుతున్న క్రమంలో వీఐ ఫైనాన్స్‌ను ఇందులో కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ ప్లాట్ ఫామ్ సాయంతో కస్టమర్లు తమ ఫైనాన్షియల్ అవసరాలను పొందడం మరింత సులువు అవుతుందని వీఐ సంస్థ చెబుతోంది. ఇందుకోసం ఇప్పటికే పలు ఫైనాన్స్ సంస్థలతో పార్టనర్‌షిప్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
వీఐ ఫైనాన్స్ ప్లాట్ ఫామ్‌లో కస్టమర్లు ఇక ఈజీగా పర్సనల్ లోన్లను పొందవచ్చు. ఎటువంటి సెక్యూరిటీ నిబంధనలు లేకుండానే మంచి వడ్డీ రేట్లకు ఈజీ పేమెంట్ చేసే విధంగా వీటిని అందిస్తున్నారు. రూ.50వేల నుంచి కస్టమర్లు ఈ లోన్లు తీసుకోవచ్చు. వడ్డీ రేటును ఇయర్లీ 10.99 శాతంగా నిర్ణయించారు. లోన్ ప్రాసెస్ కూడా కంప్లీట్‌గా డిజిటల్ గానే అయిపోతుంది. కేవైసీని ఈజీగా పూర్తి చేయవచ్చు. అత్యవసర సమయాల్లో రుణ సదుపాయం పొందాలనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడనుంది. VI Finance.
కస్టమర్లు వీఐ ఫైనాన్స్ ప్లాట్ ఫామ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం అప్ స్వింగ్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ అనే ఫిన్ టెక్ స్టార్టప్ సంస్థతో వీఐ భాగస్వామ్యం కుదుర్చుకుంది. కస్టమర్లు స్టార్టింగ్ రూ.1000 నుంచి ఎఫ్‌డీ చేసుకుని, 8.4 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. రూ.5 లక్షల వరకు కస్టమర్లు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు గాను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ తరఫు నుంచి అస్యూరెన్స్ కూడా లభిస్తుంది. అలాగే క్రెడిట్ కార్డులను పొందవచ్చు.
ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రముఖ బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డుల కోసం ఈ ప్లాట్ ఫామ్‌లో డైరెక్ట్‌గా అప్లై చేయవచ్చు. ఎఫ్‌డీ ఆధారిత క్రెడిట్ కార్డులను కూడా పొందవచ్చు. ఈ కార్డుల ద్వారా చేసే పేమెంట్ లకు కస్టమర్లు క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లు, రివార్డులు, ఈజీ ఈఎంఐ వంటి సదుపాయాలను పొందుతారు.
ఈ వీఐ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌తోపాటు యాపిల్ యాప్ స్టోర్‌లోనూ అందుబాటులో ఉంది. కాగా ఇటువంటి సేవలను ఇదివరకే అందిస్తోన్న మరొక ప్రముఖ నెట్‌వర్కింగ్ సంస్థ ఎయిర్ టెల్.