
‘Copilot’ brings the latest features: ఫోన్‌లో మనం రెగ్యులర్‌గా వాడే యాప్‌లే కాదు. ఇక వెబ్‌లో కావాల్సిన సమాచారాన్ని తెలుసుకునేందుకు వాడే బ్రౌజర్లు కూడా ఏఐ సపోర్ట్‌తో మన ముందుకొస్తున్నాయి. బ్రౌజింగ్ చేయడంలోనూ లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొచ్చిన ‘కోపైలట్’ అనే సరికొత్త ఫీచర్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. మనం బ్రౌజర్ వాడుతున్నప్పుడు చాలా ట్యాబ్‌లు ఓపెన్ చేస్తుంటాం కదా! వాటిని పదే పదే యాక్సెస్ చేయడం కొంత విసుగు తెప్పించే పనే! అయితే ‘కోపైలట్’ మోడ్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే గనుక బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది పూర్తిగా మారిపోతుంది. కోపైలట్ చాట్‌బాట్‌ను ఉపయోగించి ఓపెన్ చేసిన అన్ని ట్యాబ్స్‌ను ఇక తేలికగా మేనేజ్ చేయవచ్చు. అన్ని ట్యాబ్‌లను ఎక్స్‌ప్లోర్ చేస్తూ.. రెస్టారెంట్ బుకింగ్‌లు, ప్రొడక్ట్ కంపారిజన్‌లు, కంటెంట్‌ను బ్రీఫ్ చేయడం లాంటి ఎన్నో పనులను ఇట్టే చక్కబెట్టొచ్చు. వేర్వేరు ట్యాబ్‌లలో ఓపెన్ చేసిన హోటల్ లిస్టింగ్‌లను సైతం కంపేర్ చేయవచ్చు.
ఈ.కామర్స్‌లో షాపింగ్‌లోనే బెస్ట్ ప్రొడక్ట్‌ను కొనేందుకు ఇది సాయం చేస్తోంది. ఇందుకు మీరు వీటన్నిటికీ ట్యాబ్‌లను మార్చాల్సిన అవసరమే లేదు. ఒకే క్లిక్‌తో అన్ని పనులూ చకచకా జరిగిపోతాయి. అంతేకాదు.. వాయిస్ కమాండ్‌తో బ్రౌజర్‌ని ఆపరేట్ చేయొచ్చు. దీంతో బ్రౌజర్‌తో ఇంటరాక్ట్ అవ్వడం ఇంకా ఈజీ అవుతోంది. ఈ ఏఐ అసిస్టెంట్ తమ యూజర్లకు సందర్భానుసారం సాయం చేస్తుందన్నమాట. కోపైలట్ గురించి ఎడ్జ్ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ సీన్ లిండర్ సే మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఈ మోడ్ యూజర్ల వర్క్‌ఫ్లోకు తగ్గట్టుగా టాపిక్-బేస్డ్ జర్నీని బిల్డ్ అప్ చేసేందుకు సాయపడటమేకాక యూజర్ పర్మిషన్‌తో బ్రౌజర్ హిస్టరీ, క్రెడెన్షియల్స్‌ను కూడా యాక్సెస్ చేసే సామర్థ్యాన్ని కోపైలట్ మోడ్ పొందుతోందని చెప్పుకొచ్చారు. ‘Copilot’ brings the latest features.
సింపుల్‌గా చెప్పాలంటే.. కోపైలట్ మోడ్ వల్ల బ్రౌజింగ్ మరింత ఈజీగా, పర్సనలైజ్డ్ ఏఐ సపోర్టింగ్ సిస్టమ్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏఐ అందించే సమాచారంలో కొన్నిసార్లు మిస్టేక్స్ ఉండవచ్చు. కాబట్టి, ఏదైనా సెర్చ్ చేసేముందు లేదా యాక్షన్ తీసుకునేముందు వాస్తవాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం తప్పనిసరి అని చెబుతోంది.