
AI CEO Sam Altman: ఏఐతో పలు జాబ్స్ కనుమరుగయ్యే అవకాశం ఉందని చాట్‌జీపీటీ సృష్టికర్త అయిన శామ్ ఆల్ట్‌మన్ అన్నారు. ఏఐ ప్రభావం చూపించే ఆయా రంగాల గురించి పలు సందర్బాల్లో ఆయన ప్రస్తావిస్తూనే వచ్చారు. ఏఐ ప్రభావం ఈపాటికే అనేక రంగాల్లో కనిపిస్తోంది. ఇప్పటికే ప్రముఖ టెక్ సంస్థలు తమ ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న అనేక ఉద్యోగాలు కూడా త్వరలో తెరమరుగవుతాయని ఆల్ట్‌మన్ పలు సందర్భాల్లో చెప్పారు. ఏఐతో ముప్పు పొంచి ఉన్న ఉద్యోగాలేవంటే…
కస్టమర్ సపోర్ట్ రోల్: కస్టమర్ సర్వీస్, కాల్ సెంటర్ జాబ్స్‌ను భవిష్యత్తులో ఏఐ సొంతంగా డీల్ చేయగలుగుతుందని, ప్రస్తుతం ఉన్న ఏఐ టూల్స్ సాయంతో రియల్ టైమ్ సంభాషణలు జరపగలుగుతున్నాయని తెలిపారు. అనేక విభాగాల్లో చాట్‌జీపీటీ లాంటి మోడల్స్ ఇప్పటికే సేవలందిస్తున్నాయి. అందువల్ల మ్యాన్‌పవర్ అవసరం తగ్గుతుంది.
డేటా ఎంట్రీ, ట్రాన్స్క్రిప్షన్ ఉద్యోగాలు: మాన్యువల్‌గా సమాచారాన్ని ఎంటర్ చేసే డేటా ఎంట్రీ జాబ్స్, ట్రాన్స్క్రిప్షన్, రికార్డు కీపింగ్ లాంటి ఉద్యోగాలు మొదటగా రీప్లేస్ కానున్నాయి. ఈ పనులను ఏఐ మరింత వేగంగా, ఎర్రర్ ఫ్రీగా చేయడంతో, సంస్థలకు ప్రయోజనమే కదా. AI CEO Sam Altman.
ప్రోగ్రామింగ్ జాబ్స్: ఏఐ ప్రభావంతో కొన్ని ఎంట్రీ లెవెల్ కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్ కూడా రిస్క్‌లో పడ్డాయి. కొన్ని సంక్లిష్ట వ్యవస్థలకు మానవ పర్యవేక్షణ అవసరం ఉన్నప్పటికీ చిన్న చిన్న స్క్రిప్ట్‌లను రాయడం, డీబగ్గింగ్ చేయడం వంటివి ఏఐ సొంతంగా చక్కబెట్టగలుగుతుంది. కాబట్టి వీరి అవసరం కూడా తగ్గనుంది.
న్యాయశాస్త్రం, ఫైనాన్షియల్ డాక్యుమెంట్ రివ్యూ విభాగాల్లో కూడా ఏఐ ఎఫెక్ట్ చూపిస్తోంది. ప్రస్తుతం ఏఐ భారీ స్థాయిలో డాక్యుమెంట్స్‌ను క్షణాల్లో చదివి, సంక్షిప్త రూపంలో రివ్యూ అందిస్తుంది. దీంతో, న్యాయవాద సంస్థలు, ఆర్థిక సంస్థల్లో జూనియర్ జాబ్స్‌పై ప్రభావం పడనుంది.
కంటెంట్ క్రియేషన్‌పై కూడా ఏఐ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉండనుంది. ప్రొడక్ట్ డీటేయిల్స్, బేసిక్ మార్కెటింగ్ కాపీలను రాసే బాధ్యతలు ఏఐకి బదిలీ అయ్యే అవకాశం ఎక్కువవ్వడంతో.. మనం చేసినట్లుగా సృజనాత్మకతతో కూడిన క్రియేటివ్‌గా అనిపించే కంటెంట్‌ను భారీ స్థాయిలో సృష్టించే స్థాయికి ఏఐ వచ్చేసింది.
ఈ మార్పులకు అటు ప్రభుత్వాలు, సమాజంలోని ప్రజలు ప్రిపేర్డ్‌గా ఉండటం బెటర్. ఎందుకంటే జాబ్ మార్కెట్లో అవసరాలకు తగ్గట్టు కొత్త నైపుణ్యాలవసరం పెరుగుతుంది. వాటిపట్ల ఎప్పటికప్పుడు అవేర్ అవుతూనే, వాటిని నేర్చుకోవడంపై దృష్టి పెడితే, ఏఐతో కొన్ని జాబ్స్ పోయినా.. కొత్త నైపుణ్యాలు అవసరమైన చోటల్లా ఉద్యోగాలకు ఢోకా ఉండదు.