ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్రీడమ్‌ సేల్‌ ఈరోజు నుంచే..!

Spread the love

Freedom Sale on Flipkart: అమెజాన్ తర్వాత, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా కొత్త ఫ్రీడమ్ సేల్ స్టార్ట్‌ అయిపోయింది. ఈ సేల్‌లో యాపిల్, శాంసంగ్, నథింగ్, రియల్‌ మీ, వివో, మోటరోలా లాంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి ప్రీమియం ఫోన్‌లు చాలా తక్కువ ప్రైజ్‌కే లభిస్తున్నాయి. వీఐపీ, ప్లస్ సభ్యుల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో మిడ్‌ నైట్‌ 12 నుంచే ఈ సేల్ ప్రారంభమైంది. ఇక సాధారణ వినియోగదారులకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో రాబోయే 8 రోజుల పాటు అంటే ఆగస్టు 1 నుంచి 8 వరకు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. మరో రెండు వారాల్లో ఇండిపెండెన్స్‌ డే ఉంది.. కుదిరితే ఈ సేల్‌ మరింత ముందుకు తీసుకెళ్లే ఛాన్స్‌ ఉంది.

ఈ సమయంలో ఏమేం ఆఫర్స్‌ ఉన్నాయో చూద్దాం:

ఈ సేల్‌లో ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులపై 10 శాతం ఇన్‌స్టాంట్‌ తగ్గింపును పొందవచ్చు. అలాగే ఈఎంఐ మీద కొనుగోలు చేసే వాటిపై కూడా ఈ తగ్గింపు లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ప్రయోజనం కూడా ఉంది. ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు సూపర్ కాయిన్‌లను రీడీమ్ చేసుకునే ఛాన్స్ వీరికి అందిస్తుంది. దీనిద్వారా వినియోగదారులు అడిషనల్‌ సేవింగ్‌ను పొందవచ్చు. Freedom Sale on Flipkart.

  • ఈ సేల్‌లో మీరు ఐఫోన్16ని రూ. 69,999 స్టార్టింగ్‌ ధరకే మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. యాక్చువల్ ప్రైస్‌ వచ్చేసి రూ.79,900.
  • మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ ను రూ.25,999 ధర కాగా, రూ.20,999కే పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S24 FEని కేవలం రూ.35,999కి కొనుగోలు చేయవచ్చు. నిజానికి ఈ ఫోన్ రూ.59,999 ధర వద్ద లాంచ్ అయింది. ఈ సేల్‌లో శాంసంగ్ S24 ధర కూడా చాలావరకు తగ్గింది. మీరు దీన్ని రూ.46,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ స్టార్టింగ్ ధర వచ్చేసి రూ.74,999 వద్ద లాంచ్‌ అయ్యింది.
  • అలానే ఐఫోన్ 16e, నథింగ్ ఫోన్ 3a, Vivo T4 5Gని తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇంకెందుకు లేటు ఫ్రీడమ్‌ సేల్ ను గ్రాబ్‌ చేసుకోండి.

Also Read: https://mega9tv.com/technology/amazon-great-freedom-festival-sale-begins-august-6th-with-early-access-for-prime-members/