
Drinking diet soda increases: డైట్ సోడా.. ఇందులో మామూలు సోడాల కన్నా తక్కువ కేలరీలుంటాయి. ఇది బరువు తగ్గేందుకు లేదంటే కంట్రోల్ చేసేందుకు హెల్ప్ చేస్తుందని ప్రిఫర్ చేసే ఒక డ్రింక్ ఇది. అయితే, ఇలా రోజుకు ఒకటి చొప్పున డైట్ సోడా తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 38% పెరుగుతుందని ఆస్ట్రేలియాలో జరిగిన ఒక కొత్త రీసెర్చ్ చెబుతోంది. ఆ రీసెర్ట్ రిపోర్ట్ ప్రకారం మనం తెలుసుకోవాల్సింది ఏంటంంటే..
ఆర్టిఫిషియల్ స్వీటెనర్లతో చేసే ఈ శీతల పానీయాల వల్ల వచ్చే ప్రమాదం సాధారణ చక్కెర పానీయాల కంటే ఎక్కువగా ఉందని రిపోర్ట్ చెబుతోంది. ఆస్ట్రేలియాలోని మూడు ప్రధాన సంస్థలు కండక్ట్ చేసిన ఈ సర్వేలో 40-69 సంవత్సరాల మధ్య వయసు కలిగిన 36,000 మందిని దాదాపు 14 సంవత్సరాల పాటు టెస్ట్ చేస్తే.. అంటే, ఎప్పటికప్పుడు వారి ఆహారం, వ్యాయామం, హెల్త్ పరిస్థితి, జీవనశైలి మార్పులు ఎలా ఉన్నాయో రికార్డ్ చేయడం వల్ల.. ఆ పరిశోధనలో స్వీట్ డ్రింక్స్, కృత్రిమ స్వీటెనర్లతో చేసిన డైట్ డ్రింక్స్ ను తాగడం వల్ల, వారి ఆరోగ్యంపై ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయనే విషయాలు క్లియర్గా చెప్పేదేంటంటే టైప్2 డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఈ డ్రింక్ వల్ల మరింత పెరిగేందుకు ఆస్కారం ఉంది. Drinking diet soda increases.
నిజానికి డైట్ డ్రింక్స్ మనం అనుకునేంత సేఫ్ కావు. డైలీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా డైట్ డ్రింక్స్ తాగడం వల్ల, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇలా సఫర్ అయ్యే వారి ఆహారం, జీవనశైలితో ఈ రిస్క్ అనేది ముడిపడి ఉంటుంది. ఒక్క టైప్ 2 డయాబెటిస్ మాత్రమే కాక గుండె జబ్బులు, మెటబాలిక్ సిండ్రోమ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. డైట్ సోడాలో అడెటివ్ స్వీటెనర్లు ఉంటాయి కాబట్టి ఇవి ఆరోగ్యానికి అంత మంచివికావు. ఇక బరువు తగ్గాలనుకునేవారు సహాజమైన పానీయాలను రిప్లేస్డ్ గా తాగడం ఎంతో మంచిది.
Also Read: https://mega9tv.com/life-style/fatty-liver-disease-on-the-rise-among-it-employees/