
Fatty liver disease: హైదరాబాద్‌లోనే దాదాపు 84 శాతం ఐటీ ఉద్యోగులు మెటబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (MAFLD)తో బాధపడుతున్నారని తేలింది. అయితే ఇందుకు సంబంధించిన కారణాలు, రిపోర్ట్ రిజల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం:
ఎస్పెషల్‌గా హైదరాబాద్, బెంగళూరు వంటి ఐటీ హబ్‌ల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 71 శాతం మంది ఊబకాయం (బరువు ఎక్కువగా ఉండటం)తోనే బాధపడుతున్నారు. 34 శాతం మందికి మెటబాలిక్ సిండ్రోమ్ అనే ఆరోగ్య సమస్య ఉంది. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే అంశం. అంటే, గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, కాలేయం (లివర్) పాడయ్యే ప్రమాదం ఎక్కువవ్వడం జరుగుతుంది. Fatty liver disease.
ప్రధాన కారణాలు:
ఎక్కువసేపు కూర్చునే పనిచేయడం,
జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి రెగ్యులర్‌గా తినడం,
వర్క్ స్ట్రెస్ లైఫ్‌ను లీడ్ చేయడం, మొబైల్‌కు అడిక్ట్ అవ్వడం వంటివి.
ఈ సమస్యను నివారించేందుకు ప్రభుత్వం నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ (NP-NCD) అనే కార్యక్రమాన్ని రన్ చేస్తోంది. దీని కింద వివిధ రకాల జాగ్రత్తలు, స్క్రీనింగ్‌లు, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారం గురించి అవగాహన పెంచుతుంది. వ్యాయామం, బరువు నియంత్రణ గురించి ప్రమోట్ చేస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నివేదిక ప్రకారం, ఫ్యాటీ లివర్ వ్యాధి (MAFLD) కేవలం సిటీల్లోనే కాక ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో కూడా వేగంగా వ్యాపిస్తోందట.
ఏం చేయాలంటే:
ప్రతిరోజూ కొంతసేపు వ్యాయామం చేయాలి.
ఆహారపు అలవాట్లపై జాగ్రత్త వహించాలి. మితంగా తినడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాలి.
ముందస్తు హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలి.
ఒత్తిడి తగ్గించుకునే అలవాట్లు ( యోగా, మెడిటేషన్ లాంటివి) చేయాలి.
Also Read: https://mega9tv.com/life-style/what-is-insulin-resistance-here-is-what-we-know/