
Strange sounds from Pacific ocean: సముద్ర గర్భం.. రహస్యాల గని, అందుచిక్కని లోకం. మానవుడు చంద్రుడిపై అడుగుపెట్టాడు, అంతరిక్షంలో విహరించాడు, కానీ సముద్ర లోతుల్లో దాగిన వింతలను ఇంకా పూర్తిగా చేధించలేకపోయాడు. అలాంటి రహస్యాల్లో ఒకటి పసిఫిక్ సముద్రంలో వినిపించిన ఓ శబ్దం. అసలు సముద్రంలో వినిపించిన ఆ అంతుచిక్కని శబ్ధం ఎవరిది..? ఆ శబ్దం దేనిని పోలి ఉంది? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? సముద్ర గర్భంలో ఇలాంటి శబ్దాలు ఎందుకు వినిపిస్తాయి? శాస్త్రవేత్తలు దీన్ని ఎలా అన్వేషిస్తున్నారు?
వేల కిలోమీటర్ల అంతరిక్ష లక్ష్యాలను చేరుకుంటున్న మానవుడు.. భూగోళంపై ఉన్న సముద్ర గర్భంలో ఏముందో మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు. అందుకే సముద్రంలో ప్రతిదీ వింతే. రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. మనకు తెలియని వింత, విశేషాలు సముద్ర గర్భంలో దాగి ఉన్నాయి. అలాంటి ఓ వింత శాస్త్రవేత్తలకు ఎన్నో ఏళ్లుగా ప్రశ్నగా మిగిలింది. 1999లో పెసిఫిక్ సముద్రంలో అనూహ్యమైన శబ్దం రికార్డయింది. మహిళ గొంతులా సన్నని, హమ్మింగ్ లాంటి ఈ శబ్దాన్ని నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ హైడ్రోఫోన్‌లు గుర్తించాయి. ఈ శబ్దానికి జూలియా అని నామకరణం చేశారు. దాదాపు 3,000 మైళ్ల దూరం నుంచి వినిపించిన ఈ శబ్దం శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
జూలియా శబ్దం బ్రాన్స్‌ఫీల్డ్ స్ట్రైట్, కేప్ అడారే మధ్య సముద్ర లోతుల్లో సుమారు మూడు నిమిషాలు వినిపించింది. ఈ శబ్దం విస్తృతంగా ప్రయాణించి, వేల మైళ్ల దూరంలోని హైడ్రోఫోన్‌లలో రికార్డయింది. సముద్రంలో శబ్దాలు ఇంత దూరం ఎలా ప్రయాణించాయనే ప్రశ్న కూడా ఈ విషయంలో ఆసక్తిని రేపాయి. శాస్త్రవేత్తలు దీన్ని ఐస్‌బర్గ్‌ల కదలికతో ముడిపెట్టారు, కానీ ఖచ్చితమైన కారణం గుర్తించలేకపోయారు.
జూలియా శబ్దం గురించి ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. కొందరు దీన్ని ఐస్‌బర్గ్‌లు రాసుకోవడం వల్ల వచ్చిన శబ్దంగా భావించారు. కొందరు ఈ శబ్ధాన్ని సముద్ర జీవుల సౌండ్ అని, భూకంప వల్ల వచ్చిన శబ్ధమని, మరికొందరు అగ్నిపర్వత కదలికల వల్ల వచ్చి ఉంటుందని చెప్పుకొచ్చారు. కాని అందరివీ ఊహాగానాలే. కొన్ని నివేదికలు నాసా ఉపగ్రహాలు ఈ ప్రాంతంలో అసాధారణ నీడలను గుర్తించినట్లు తెలిపాయి. ఈ శబ్దం సముద్ర లోతుల రహస్యాలను తెలుసుకోవాలనే ఆసక్తికని మరింత పెంచింది. Strange sounds from Pacific ocean.
సముద్ర గర్భం అన్వేషణ మానవుడికి ఎందుకు సవాల్‌గా ఉంది? అంతరిక్షంలోకి వెళ్లడం సాధ్యమైనా, సముద్ర లోతుల్లోకి చొచ్చుకెళ్లడం కష్టంగా మారింది. సముద్ర ఒత్తిడి, చీకటి, సాంకేతిక పరిమితులు సముద్రంలో అన్వేషణను సంక్లిష్టం చేస్తున్నాయి. సముద్రంలో అపారమైన నీటి ఒత్తిడి, అనూహ్య పరిస్థితులు పరిశోధనలు చేయాలనుకునే శాస్త్రవేత్తలను ఇబ్బందులు కలిగిస్తున్నాయి. సముద్ర గర్భంలో 70 శాతం ఏముందో ఇప్పటికీ తెలియదంటే అర్థం చేసుకోవచ్చు సముద్రంలోకి వెళ్లడం ఎంతకష్టమోనని.
ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు సముద్ర గర్భం అన్వేషణలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. NOAA, చైనా ఓషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జపాన్ ఏజెన్సీ ఫర్ మెరైన్-ఎర్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సంస్థలు సముద్ర లోతుల్లో పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. రోబోటిక్ సబ్‌మెర్సిబుల్స్, డీప్-సీ డ్రోన్‌లు, సోనార్ సాంకేతికతలు ఈ పరిశోధనలకు ఊతం ఇస్తున్నాయి. ఈ దేశాలు సముద్ర గర్భంలో ఖనిజాలు, జీవవైవిధ్యం, భౌగోళిక కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నాయి. ఈ పరిశోధనల సమయంలో కొత్త వింతలు బయటపడుతున్నాయి. అలా బయటపడిందే జూలియా శబ్ధం.
జూలియా శబ్దం వంటి రహస్యాలు సముద్ర గర్భంలో భౌగోళిక కార్యకలాపాలపై కొత్త కోణాలను అందిస్తాయి. శాస్త్రవేత్తలు ఈ శబ్దాన్ని ఐస్‌బర్గ్‌ల కదలికలు, భూకంపాలు, లేదా అగ్నిపర్వత పేలుళ్లతో ముడిపెట్టారు. అలాగే సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్ కదలికలు, హైడ్రోథర్మల్ వెంట్స్ వంటివి ఈ శబ్దాలకు కారణం కావొచ్చని అంటున్నారు. అయితే వేటికి సరైన ఆధారాలు లేవు.
ఏళ్లు గడుస్తున్నా జూలియా శబ్దం రహస్యం ఇప్పటికీ చేధించబడలేదు. సముద్ర గర్భం ఇంకా అన్వేషించని లోకంగా మిగిలిపోయింది. NOAA, నాసా, ఇతర సంస్థలు ఈ శబ్దాలను అధ్యయనం చేస్తున్నప్పటికీ, సముద్ర లోతులు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలు సముద్ర గర్భంలో పరిశోధనలను ముమ్మరం చేస్తున్నాయి. సముద్ర లోతుల రహస్యాలు మానవ జ్ఞానాన్ని మరింత విస్తరింపజేస్తాయనడంలో సందేహం లేదు.
Also Read: https://mega9tv.com/international/does-trump-in-danger-unauthorised-plane-enters-trumps-area/