ట్రంప్ కు ప్రాణాపాయం ఉందా..?

Spread the love

Does Trump in Danger: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఓ గండం నుంచి గట్టెక్కారు. న్యూజెర్సీలోని ఓ గోల్ఫ్ క్లబ్‌లో ట్రంప్ ఉండగా, ఓ విమానం అకస్మాత్తుగా దూసుకువచ్చింది. ఇది గమనించి వెంటనే స్పందించిన యుద్ధ విమానాలు .. దానిని అడ్డుకున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. అయితే ట్రంప్ ను లేపేయడానికి జరుగుతున్న కుట్రలని కొందరు అంటుంటే.. కాదుకాదు.. ఇవి పొరపాటును జరుగుతున్న ఘటనలని కొందరంటున్నారు. అసలు అమెరికా అధ్యక్షుడు ఉన్న ప్రాంతంలో ఎలాంటి వైమానిక ఆంక్షలు ఉంటాయి..? ట్రంప్ భద్రతకు ఎలాంటి ముప్పు ఉంది? ఇరాన్ ఎలాంటి వార్నింగ్ ఇచ్చింది..?

అమెరికా అధ్యక్షుడు అంటనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటారు. ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడికి ఉండే భద్రత మరెవరికీ ఉండదంటే అతిశయోక్తి కాదు. అలాంటిది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అమెరికా న్యూజెర్సీలోని బెడ్మిన్స్టర్ గోల్ఫ్ క్లబ్‌లో డొనాల్డ్ ట్రంప్ ఉండగా, అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ విమానం అటువైపు దూసుకువచ్చింది. సాధారణంగా అమెరికా అధ్యక్షుడు ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతంలో తాత్కాలిక నో-ఫ్లై జోన్ అమలులో ఉంటుంది. కానీ అక్కడ నో ఫ్లై జోన్ ఉన్న ఓ విమానం రావడం ఆందోళన కలిగించింది.

ఎటువంటి అనుమతి లేని విమానం నో-ఫ్లై జోన్‌లోకి చొరబడగానే, యుద్ధ విమానాలు ఫ్లేర్‌లను వదిలి పైలట్‌ను హెచ్చరించాయి. పైలట్ వెంటనే విమానాన్ని దారి మళ్లించి వేరే వైపు తీసుకెళ్లాడు. ఆ రోజు ఇలాంటి ఉల్లంఘనలు ఐదు సార్లు జరిగాయి. ఈ ఘటనలు పైలట్ల నిర్లక్ష్యం వల్లా, లేక ఉద్దేశపూర్వకంగా జరిగాయా? అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. అయితే ఇటీవల ట్రంప్ కు ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల ఇరాన్ కూడా ట్రంప్ కు అనేక హెచ్చరికలు చేసింది. దీంతో ట్రంప్ భద్రతపై మరింత ఆందోళన పెరిగింది. ఇలాంటి సమయంలో ఈ విమానాల వ్యవహారం చర్చనీయాంశమైంది.

ఒక్క వారంలో ట్రంప్ గోల్ఫ్ క్లబ్ వద్ద ఏడు నో-ఫ్లై జోన్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఆధునిక రాడార్ వ్యవస్థలు, నైట్ విజన్ ట్రాకింగ్ ఉన్నా, కొందరు పైలట్లు నిబంధనలను అతిక్రమించడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఎప్పటి కప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవి కేవలం నిబంధనలు పాటించకపోవడం వల్ల జరిగిన ఘటనలైతే సరిపోతుంది. కానీ కావాలని ఎవరైనా ట్రంప్ ను అటాక్ చేయడానికి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. Does Trump in Danger.

ట్రంప్ కు ఇటీవల ఇరాన్ నుంచి వచ్చిన బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. 2020లో అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ ఖాసెమ్ సోలేమనీ హతమైన తర్వాత, ఇరాన్ నాయకులు ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ సీనియర్ కన్సల్టెంట్ మహ్మద్ జావద్ లరిజానీ, ట్రంప్ ఫ్లోరిడాలో సన్‌బాత్ చేస్తుంటే డ్రోన్ దాడి చేయవచ్చని బహిరంగంగా చెప్పారు. అయితే ఇరాన్ ఈ హెచ్చరిక డ్రోన్ దాడి గురించి చేసిందా లేక.. విమానాల దాడికి సంకేతికంగా చెప్పిందా అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.

ఇరాన్ బెదిరింపులను ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు. తనకు సన్‌బాత్ అలవాటు లేదని, ఇలాంటి హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోనని మీడియాతో చెప్పారు. అయినా, అమెరికా నిఘా సంస్థలు ట్రంప్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. ఇరాన్ నుంచి ట్రంప్ కు ముప్పు ఉందని అధికారులు ధృవీకరించారు. ట్రంప్ బృందం ఇంటర్నల్ కమ్యూనికేషన్‌లు హ్యాక్ అయినట్లు నివేదికలు సూచించాయి.

ట్రంప్ తరచూ వెళ్లే ప్రాంతాలైన న్యూజెర్సీలోని బెడ్మిన్స్టర్ గోల్ఫ్ క్లబ్, ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో, న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్ ఎప్పుడూ గట్టి భద్రతలో ఉంటాయి. సీక్రెట్ సర్వీస్, రాడార్ వ్యవస్థలు, డ్రోన్ నిరోధక సాంకేతికతలు ఈ ప్రాంతాల్లో అమలులో ఉన్నాయి. ట్రంప్ ఎక్కడున్నా, NORAD, FAA సమన్వయంతో గగనతల రక్షణ వ్యవస్థ పనిచేస్తుంది.

అమెరికా అధ్యక్షుడి రక్షణ కోసం సీక్రెట్ సర్వీస్‌లో సుమారు 7,000 మంది ఏజెంట్లు నిరంతరం పనిచేస్తారు. అయితే ఎంత పనిచేసినా.. చిన్న లోపం అధ్యక్షుడి ప్రాణానికే ముప్పు తీసుకురావొచ్చు. అందుకే భద్రత బలగాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయి. అయితే ఈ ఘటనలు, ఇరాన్ బెదిరింపులు ట్రంప్ రాజకీయ ఇమేజ్‌పై, అమెరికా భద్రతా వ్యవస్థలపై ప్రభావం చూపాయి.

Also Read: https://mega9tv.com/international/trump-vs-chatbots-trump-calls-india-a-dead-economy-ai-refuses-trump-comments/