టాలీవుడ్ లో ఏం జరుగుతోంది..?

Spread the love

Tollywood Press Meet Controversies: ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ లు మితిమీరిపోతున్నాయి. సినిమా నచ్చకపోతే.. చూడకండి.. లేదంటే.. ఈ సినిమా నచ్చకపోతే.. నా తర్వాత సినిమా చూడకండి అంటూ ఒకరి మించి ఒకరు.. తమ సినిమా కోసం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వెదికలపై చేప్తుండడం చూస్తున్నాం. అంతేకాదు.. సినిమా హిట్ కోసం తామే ట్రోల్ అయ్యేలా కామెంట్లు కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి స్టంట్స్ తో 200 కోట్ల రూపాయాలను కలెక్ట్ చేసిన మూవీస్ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా కాయిన్ కు ఒకవైపు మాత్రమే.. ట్రోల్స్ తో నిజంగానే మంచి సినిమాలను చంపేస్తున్న బ్యాచ్ కూడా టాలీవుడ్ లో రెడీ అయ్యింది. ఇదే విషయాన్ని ఓజీ సినిమా రిలీజ్ కు ముందు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇటీవల ప్రొడ్యూసర్ బన్నీ వాసు మాట్లాడింది కూడా ఈ ట్రోల్స్ గురించే. ఒక్క ముక్కలో చెప్పాలంటే టాలీవుడ్ లో రెండు ట్రెండ్స్ నడుస్తున్నాయి. అయితే విక్టిమ్ కార్డ్స్ ఉపయోగించి సినిమా ను హిట్ చేసుకోవడం, ఇంకోటి సోషల్ మీడియా ట్రోల్స్ తో ఎదుటి సినిమాను చంపేయ్యడం. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎటు పోతోంది..? టాలీవుడ్ లో ఏం జరుగుతోంది..? పెద్ద పెద్ద వాళ్లు సైతం దీన్నే ఎందుకు ఫాలో అవుతున్నారు..?

ఒకప్పుడు టాలీవుడ్ లో ఎవరికి వారు తమ సినిమా గురించి చెప్పుకుంటూ పబ్లిసిట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు జరుగుతుంది వేరు. సినిమాలో సబ్జెక్ట్ లేని కారణంగానో ఏమో.. కొంతమంది కాంట్రవర్సీ డైలాగ్స్ అలా జనాల్లోకి విసిరేస్తూ ఉంటారు. అందుకోసం పబ్లిక్ గా కన్నీరు పెట్టుకుంటారు, అంతేందుకు తనను తొక్కేస్తున్నారంటూ.. తన గురించి సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చ జరిగేలా..రచ్చ చేస్తుంటారు. తన సినిమా గురించి ఇంట్రెస్టింగ్ గా చెప్పుకోవడం పక్కనపెట్టి.. ఏ మాత్రం సంబంధం లేని టాపిక్ మాట్లడేస్తుంటారు. ఏం చేసైనా సరే సినిమాకు పబ్లిసిటీ రావాలని అనుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే జరుగుతుంది.

సినిమా అంటేనే ఓ తపస్సు.. ఖర్చు లక్షల కోట్లు. రోజులు, నెలలు సంవత్సరాల తరబడి డబ్బులు ఖర్చు పెట్టి షుటింగ్ పూర్తి చేసుకోని.. తీరా రిలీజ్ అయ్యాక తుస్సు మంటే.. ఆ గోడు వర్ణరహితం. అలాగే చాలా సినిమాలు వచ్చి పోతుంటాయి. కొన్ని సినిమాలు అయితే ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్లిందో కూడా తెలియదు. అసలు అలాంటి సినిమా ఒకటి ఉందా..? ఆశ్చర్యం వ్యక్తం చేయ్యడమే మన వంతు అవుతోంది. అలాంటి లిస్ట్ లో తమ సినిమా ఉండకూడదనుకుంటే.. ఏం చేయ్యాలి..? రిలీజ్ కు ముందే ఆ సినిమా గురించి జనాలు మాట్లాడుకోవాలి. దాని కోసం కొంతమందైతే ఎన్నెన్నో ప్లాన్స్ చేస్తారు. ఏకంగా ఓ పీఆర్ టీమ్ ఇందుకోసం పనిచేస్తుంటుంది. ఏం చేస్తే.. ఏం మాట్లాడితే.. వివాదస్పదమవుతుందో చూసుకుంటారు. అదేదో అనుకోకుండా జరిగినట్లుగా ప్రమోషన్ టైంలో అప్లై చేస్తారు. అది కాస్త వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఆ వీడియో కాస్త చక్కర్లు కొడుతుంది. ఒక్కోక్కసారి అది జనాల్లోకి నెగిటివ్ గా వెళ్లిన.. సినిమా గురించి అందరికి తెలుస్తుందని.. అనుకుంటారు అంతే. ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ ఇదే..

అందర్ని ఈ లిస్ట్ లోనే వేయ్యాలేం కానీ.. కొందరు ప్రమోషన్స్ లో తమ బాధ వ్యక్తం చేస్తుంటారు. కాకపోతే బయటకు అదో విక్టిమ్ కార్డుల కనిపిస్తుంటుంది. కావాలని గేమ్ ప్లే చేయ్యడమని కాదు కానీ.. సినిమా డెప్త్ పైన అలా అనేస్తుంటారు అంతే. ఇక మరోరకం నాని ప్రొడక్షన్ నుంచి వచ్చిన కోర్టు మూవీ. ఈ సినిమా కనుక నచ్చకపోతే.. హిట్ 3 సినిమా చూడొద్దన్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగానే.. ఒక్క డైలాగ్ తో రెండు సినిమా గురించి జనాలు చర్చించుకునేలా చేశారు. అప్పటి వరకు కోర్టు సినిమా మీద అంచన వేరు.. ఆ తర్వాత అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్లుగానే సినిమాలో కూడా సబ్జెక్ట్ ఉంది. సినిమాలో విషయం లేకపోతే ఎన్ని డైలాగ్స్ కొట్టి ఏం లాభం చెప్పండి. ఒక్క మాట ఒక్కొక్క సారి సినిమాకు హిట్ ను తీసుకొచ్చి పెడుతోంది.

ఇక్కడ మరో విసయం ఏంటంటే.. ఓజీ సినిమా రిలీజ్ కు ముందు పవన్ కళ్యాన్ సైతం ఇలాంటి అంశాలే లేవనెత్తారు. రాలేని పరిస్థితి ఉన్న సరే.. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం ఎందుకు బయటకు వచ్చారో చెప్పుకున్నారు.ఏళ్ల తరబడి సినిమాలుు తీస్తుంటే.. కొందరేమో సినిమా రిలీజ్ కాకముందే సినిమాను చంపేస్తున్నారంటూ.. తన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే హరిహర వీరమల్లు సినిమా ఎఫెక్ట్ నుంచి బయటకు రావాలన్న.. ఆ ఎఫెక్ట్ ఓజీ మీద పడకూడదన్న ఇంకేదో జరిగాలి. పవన్ చేసి మాట్లడి ఉండకపోవచ్చు. కానీ జనంలోకి విషయం వెళ్లింది. ఓజీ సూపర్ హిట్ అయ్యింది. కలెక్షన్ లు ఓ రేంజ్ లో వచ్చాయి. ఇది చేప్తుంటే.. మరో సినిమా గుర్తొస్తుంది కదా.. కిరణ్ అబ్బవరం కూడా క సినిమా ప్రమోషన్ లో ఎమోషనల్ అయ్యారు. నాతో మీకు ప్రాబ్లమ్ ఏంటి..? కొన్ని హిట్ అవుతాయి. కొన్ని ప్లాప్ అవుతాయి. మీ బాధేంటి..? ఒక రకంగా చెప్పాలంటే తాను ఎక్కడి నుంచి వచ్చానో చెప్పుకున్నారు. సాధారణ స్టెజ్ నుంచి 8 సినిమాల్ల 4 డిసెంట్ హిట్ కావడమంటే మాములు విషయం కాదని.. సెంటిమెంట్ గా చెప్పుకొచ్చారు. అయితే ఆయన స్పీచ్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన వారిపై ఇలాంటి ట్రోల్సా చేసేది అని అర్ధవచ్చేలా సాగింది. అది చాలా వైరల్ అయ్యిం

హిరో విశ్వక్ సేన్ కూడా ఇలాంటి విక్టిమ్ కార్డ్ నే ప్లే చేశారనే టాక్ ఉంది. ఎందుకంటే అప్పట్లో మలయాళం సినిమా ప్రేమలు, విశ్వక్ సేన్ మూవీ గామి ఒకేసారి రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు హిట్ అయ్యాయి. కానీ ప్రేమలు బ్లాక్ బస్టర్ హిట్. పైగా టాలీవుడ్ ప్రముఖులు సినిమాపై ట్వీట్లు చేసి మరింత హైప్ పెంచారు. అప్పుడే విశ్వక్ మన వాళ్లను ఎందుకు ఎంకరేజ్ చేయ్యారంటూ.. డైరెక్ట్ గా డైలాగ్ వేశారు. ఒకరకంగా విక్టిమ్ కార్డ్ ప్లే చేయ్యడమే ఇది అని పలువురు సినీ ప్రముఖుల అభిప్రాయం. మూవీ రిలీజ్ సమయంలో కూడా ఈయన సపరేట్ లైన్ లో వెళ్తుంటారు.మొదటి నుంచి ఈయన సినిమాల ప్రమోషన్ వివాదాలతోనరే స్టార్ట్ అవుతోంది. Tollywood Press Meet Controversies.

ఇకపోతే బన్నీ వాసు. ఈయన కూడా ఇటీవలే నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ.. డైలాగ్ వేశారు. అయితే ఈ సారి దీపావళికి 17,18,19 లలో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే రిలీజ్ కు ముందు రెండు సినిమాలకు మాత్రమే థియేటర్లు ఉన్నాయి. మూడో సినిమాకు లేవు. థియేటర్లు దొరకలంటే సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేయ్యాలి. అదే చేస్తున్నారని బన్నీవాసు చెప్పుకొచ్చారు. బ్రదర్ అంటూ స్టార్ట్ చేసి స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. సదరు వ్యక్తి హిరో కావొచ్చు, ప్రొడ్యూసర్ కావొచ్చు.. అయితే గతంలో బన్నీవాసుతో కలిసి పనిచేసిన వ్యక్తే అందుకు బ్రదర్ అని పిలిచారు. అయితే దీన్ని పబ్లిసిటీ స్టంట్ అనుకోవాలా..? లేక నిజంగానే ట్రోల్స్ జరగడంతో వచ్చిన ఆవేదనతో అన్న మాటలా..? అనేది పక్కన పెడితే.. ఆయన కామెంట్స్ సినిమా మాత్రం మంచి టాక్ ను తెచ్చుకుంది. ఇలా ఒక సినిమాను తొక్కాలన్న.. థియేటర్ల నుంచి తొందరంగా పంపించలన్న కూడా ఈ ట్రోల్స్ స్టంట్స్ చేస్తున్నారు. దీని కారణంగా మన తెలుగు సినిమాను మనమే తొక్కిస్తున్నామని ట్రోల్స్ మర్చిపోతున్నారు. మరీ దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతోంది.