స్మార్ట్ వర్క్.!

Spread the love

CM Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తన చతురతను చాటుకున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో చంద్రబాబుకు జాతీయస్థాయిలో మంచి పేరు ఉంది. 1999లో శ్రీకాకుళం జిల్లాలో సూపర్ సైక్లోన్ నుంచి నేటి మొంథా తుఫాన్ వరకు ఆయన చర్యలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆయన పనితీరును బయటపెట్టాయి. రాజకీయంగా చంద్రబాబును విభేదించిన వారు ఉంటారు. కానీ ఆయన పనితీరుకు ప్రత్యర్థులు సైతం ఫిదా అవుతారు.

నిత్య విమర్శకులు సైతం ఆయనలో ఉన్న గొప్పతనాన్ని చెబుతుంటారు. అయితే ఏపీలో మాత్రం వైసిపి నేతల పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. వారి మాటలను పక్కన పెడితే.. మొంథా తుఫాను.. ప‌లు ప్ర‌భావిత జిల్లాల ప్ర‌జ‌ల‌కు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. కానీ, ఇదే స‌మయంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి, మంత్రి నారా లోకేష్‌ల‌కు కూడా నిద్ర‌లేకుండా చేస్తోంద‌న్న విష‌యం చాలా మందికి తెలియ‌దు.తాజాగా చంద్రబాబు ఏకధాటిగా 12 గంటలపాటు తుఫాన్ సహాయ చర్యలపై సమీక్షలు నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు సచివాలయంలోనే ఉన్నారు. అంతకు ముందు రోజు సైతం సచివాలయంలోనే గడిపారు.

మొంథా తుఫాన్ ఏపీని తీవ్రంగా వణికించింది. మచిలీపట్నం, కాకినాడ మధ్య నరసాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటలకు తీరాన్ని దాటింది. అటు తరువాత బలహీనపడింది. అయినా సరే ఏపీకి అత్యంత భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించింది. అయితే సోమవారం అర్ధరాత్రి వరకు సచివాలయంలోనే ఉండి సహాయక చర్యలపై సమీక్షించారు చంద్రబాబు. మంగళవారం ఉదయం సైతం సచివాలయానికి వచ్చి అర్ధరాత్రి వరకు గడిపారు. తీవ్ర తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల‌కు ప్ర‌త్యేక బృందాల‌ను పంపించిన‌ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆర్టీజీఎస్ కేంద్రంలోనే కూర్చుని మంగ‌ళ‌వారం రాత్రి వ‌ర‌కు మంత్రుల‌తో ఆయ‌న‌ సమీక్ష నిర్వహించారు. తీవ్ర తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వం నుంచి ఐదారుగురితో ఓ బృందాన్ని పంపించారు. ప్రభుత్వ బృందాలు గ్రామాల్లో ఉంటే… ప్రజలకు భ‌రోసా కలుగుతుందన్న ఉద్దేశంతో చంద్ర‌బాబు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అంతేకాదు.. భారీ వ‌ర్షాల కార‌ణంగా కాల్వలు, చెరువులు రోడ్లకు ఎక్కడైనా కోతలు, గండ్లు పడ్డాయా అనే అంశంపై రాత్రిపూట కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు.

తుఫాను ప్రభావం ఉన్న అన్ని గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బందితో ఆర్టిజిఎస్ నుంచి టెలికాన్ఫెరెన్స్ చేపట్టారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విరామం లేకుండా పరిస్థితిని సమీక్షించారు. మూడుసార్లు ఆర్టిజిఎస్ కు వచ్చారు. సమీక్షలతో పాటు రెండుసార్లు టెలికాన్ఫరెన్స్ లు నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేయడంతోపాటు.. టెక్నాలజీని వినియోగించుకున్నారు. శాఖల వారీగా నష్టం అంచనా నివేదికలను సిద్దం చేయాల‌ని కూడా రాత్రే ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. వ‌ర్షాల‌ ప్రభావం తగ్గగానే యుద్ద ప్రాతిపదికన విద్యుత్తును పునరుద్దరించాలని సూచించారు. జిల్లాల్లోని పరిస్థితిని చంద్రబాబుకు ఫోన్ ద్వారా మంత్రులు వివరించారు. ఇదంతా.. తుఫాను ప్ర‌భావ స‌మ‌యంలోనే జ‌ర‌గ‌డం విశేషం.

గ్రామాల్లో ప్రభుత్వ ప్రతినిధులు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందేనని, బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపైనే ఉందని అన్నారు. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట, వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. మొంథా తుఫాన్ కారణంగా వేటకు వెళ్లకుండా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు సాయం అందిస్తుందని తెలిపారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాస్త‌వానికి తుఫాను ప్ర‌భావం త‌గ్గాక స‌మీక్షిస్తారు. కానీ, సీఎం అలా కాకుండా.. తుఫాను స‌మ‌యంలోనే అన్నీ సేక‌రించారు చంద్రబాబు. చివరకు రాత్రి 11:30 గంటల తరువాత చంద్రబాబు ఇంటికి బయలుదేరు వెళ్లారు.

మరోవైపు మంత్రి నారా లోకేష్ రాత్రంతా సచివాలయంలోనే ఉండిపోయారు. అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులకు విద్యుత్తు అస్తవ్యస్తంగా మారింది. చెట్లతో పాటు భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ అన్ని జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప‌లు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తున్నాయ‌ని.. వాటి ప్ర‌భావంతో ప్రాణ‌, ఆస్తిన‌ష్టం జ‌ర‌గ‌కుండా చూడాల‌ని దిశానిర్దేశం చేశారు. CM Chandrababu Naidu.

నిజానికి విపత్తుల నిర్వహణలో చంద్రబాబుకు ప్రత్యేక మేనేజిమెంట్ స్కిల్ ఉంటుందని చెబుతున్నారు. విపత్కాలంలో ఆయన స్పందించే తీరు ప్రజలను ఫిదా చేస్తుంది. అయితే గతంలో తీవ్రంగా కష్టపడి ఇతరులను సైతం తనలా కష్టపడేలా చేయడానికి శ్రమించే చంద్రబాబు ఈ సారి మాత్రం చాలా స్మార్టుగా ఫలితం సాధించారని ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ప్రభుత్వ ముందస్తు చర్యలతోనే చాలావరకు నష్టం జరగలేదు. ప్రధానంగా ప్రాణ నష్టం నియంత్రించడంలో ప్రభుత్వం విజయవంతం అయింది. అయితే చంద్రబాబు వరుసగా రెండు రోజులపాటు అర్ధరాత్రి వరకు సచివాలయంలోనే ఉండిపోయారు. ఏడు పదుల వయస్సులో ఆయన చేస్తున్న పని అందరికీ ఫిదా గా మారింది.