
Prashanth Kishore EC Notice: ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు చిక్కుల్లో పడ్డారు. జన్ సురాజ్ పార్టీని స్థాపించి ఏ పొత్తూ లేకుండా ఒంటిరిగా బరిలో నిలిచిన కిషోర్‌కు రెండు రాష్ట్రాల్లో ఓటు ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇప్పుడు విషయం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ అంశంపై అధికార, విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంతకు ఏ ఏ రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది. అసలు ఏం జరిగిందో తెలుసు కోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ
బీహార్‌లోని కర్గహార్ అసెంబ్లీ నియోజకవర్గంలో, పశ్చిమబెంగాల్‌లోని భవానీనగర్ అసెంబ్లీ స్థానంలో ప్రశాంత్ కిషోర్ ఓటరుగా ఉన్నారని గుర్తించారు. ఈ నేపథ్యంలో కర్గహార్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ కిషోర్‌కు లేఖ రాశారు. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో మీరు ఓటరుగా ఎందుకు పేరు నమోదు చేసుకున్నారో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ లేఖలో ఆదేశించారు. ఆయన నేరుగాగానీ, ఆయన తరపున ఎవరైనాగానీ హాజరై వివరణ ఇవ్వవచ్చని లేఖలో తెలిపారు.
అధికారిక రికార్డుల ప్రకారం, ప్రశాంత్ కిశోర్ పేరు కోల్‌కతాలోని భవానీపుర్ నియోజకవర్గంలో 121 కాళీఘాట్ రోడు చిరుమానామాతో నమోదై ఉంది. ఇది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం చిరునామా. అలాగే బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహించే నియోజక వర్గం కూడా ఇదే. ప్రశాంత్ కిశోర్ ఓటు వేయాల్సిన కేంద్రం బి.రణిశంకరి లేన్‌లోని సెంట్ హెలెన్ స్కూల్ అని ఎన్నికల అధికారి తెలిపారు. 2021లో జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ తృణమూర్ కాంగ్రెస్‌కు రాజకీయ సలహాదారుడిగా పని చేశారు.
ఇక ఇదే సమయంలో, ప్రశాంత్ కిషోర్ పేరు బీహార్ రాష్ట్రం రోహ్తాస్ జిల్లాలోని కార్గహార్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా నమోదు అయింది. అది ససారం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉంది. పోలింగ్ కేంద్రం కోనార్లోని మాధ్య విద్యాలయ అని అధికారి తెలిపారు. 1950లోని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తి ఒకకంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదు కావడం చట్టవిరుద్ధమని ఎన్నికల అధికారి తెలిపారు. అదేవిధంగా, సెక్షన్ 18 ప్రకారం, ఒకే నియోజకవర్గంలో బహుళ పేర్లతో నమోదు చేయడాన్ని కూడా నిషేధిస్తుందని చెప్పారు. ఎవరైనా తమ నివాసం మార్చుకున్నప్పుడు, ఫారమ్ 8 ద్వారా ఓటరు రికార్డులను మార్చడం తప్పనిసరి అని ఆయన వివరించారు.
ఈ విషయంపై జన్‌సురాజ్ పార్టీ జాతీయ ప్రతినిధి కుమార్ సౌరభ్ సింగ్ స్పందించారు. దీనికి పూర్తి బాధ్యత ఎన్నికల మిషన్‌దే అవుతుంది. బీహార్‌లో ఎస్ఐఆర్ను ఎంతో ఉత్సాహంగా ప్రారంభించింది. పేర్ల తొలగింపు కూడా భారీగా జరిగింది. అయినా ఒక ప్రముఖుడి విషయంలోనే ఇలాంటి లోపం జరిగితే, మిగతా ప్రాంతాల్లో ఈసీ ఎంత జాగ్రత్తగా పని చేస్తోందో ఊహించవచ్చు. ప్రశాంత్ కిషోర్ చదువుకున్న వ్యక్తి. ఆయనకు బాధ్యతలు బాగా తెలుసు. గతంలో ఆయన మమతా బెనర్జీకి వ్యూహకర్తగా పని చేశారు. తమ వైపు నుంచి తప్పు జరిగిందని భావించినా, ఏమైనా సందేహాలు ఉన్నాయని ఈసీ సంప్రదిస్తే, లీగల్ టీమ్ స్పందిస్తుంది’ అని సౌరభ్ సింగ్ తెలిపారు. అయితే, బంగాల్ ఓటరు జాబితా నుంచి పేరును తొలగించేందుకు ప్రశాంత్ దరఖాస్తు చేశారా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.
మరోవైపు ఈ విషయంపై ఎన్డీఏ, ఇండియా కూటమి నుంచి విమర్శలు వస్తున్నాయి. బిహార్‌కు చెందిన ప్రశాంత్ కిశోర్ కార్యాలయాలు ఢిల్లీలో ఉన్నాయని, కానీ బంగాల్లో ఓట హక్కు ఎందుకు ఉందని జేడీయీ ఎమ్మెల్సీ నీరజ్ కుమారు అన్నారు. వ్యూహకర్త కావాలంటే ఆ రాష్ట్రంలో ఓటరుగా ఉండాలా అంటూ ప్రశ్నించారు. ‘2021 ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజ్యసభకు పంపించమని మమతా బెనర్జీతో కిశోర్ ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేశారని వారు అనుమానం వ్యక్తం చేశారు. కానీ బెనర్జీ తిరిగి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయనను పక్కనపెట్టారు. అందుకే కన్సల్టెన్సీ వ్యాపారం నుంచి తప్పుకున్నట్లు నాటకం ఆడారు’ అని నీరజ్ కుమార్ అన్నారు. అయితే మమతా బెనర్జీ గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా తన కెరీర్ ముగిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ అంశాన్ని తీవ్రమైన నేరమని బీజేపీ అంటుంది. కిషోర్ బీహార్ ఎన్నికలను ప్రభావితం చేయడానికి తృణమూల్ కాంగ్రెస్‌తో రహస్యంగా కుట్ర చేస్తున్నారని బీజేపీ ప్రతినిధి నీరజ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు ఆర్జేడీ ప్రతినిధి మృత్యుంజయ్ తివారి స్పందిస్తూ బిహార్‌లో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉన్న లోపాలను ఇది బయటపెడుతోందని అన్నారు. నేతల పేర్లు కూడా రెండు చోట్ల నమోదు అయిన ఉదాహరణలు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పేరు కూడా అదే జాబితాలో చేరిందని వ్యాఖ్యనించారు.
దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల్లో నకిలీ, పేర్లు పునరావృత కావడం వంటి సమస్యలు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ అంగీకరించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని సమగ్ర ఓటర్ల జాబితా సవరణను ప్రారంభించింది. మొదటగా ఈ ప్రక్రియలో బిహార్‌లో చేపట్టింది. సెప్టెంబర్ 30న విడుదల చేసి ఓటరు జాబితాలో ఏకంగా 68.66 లక్షల పేర్లు తొలగించింది. అందులో సుమారు 7 లక్షల మందికి రెండు చోట్ల ఓట్ల ఉన్న కేసులు అన్నాయని వెల్లడించింది. తొలిదశలో భాగంగా బిహార్‌లో ఎస్ఐఆర్ను విజయవంతంగా పూర్తి చేసింది. తాజాగా 12 రాష్ట్రాల్లో/కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో దఫా ఎస్ఐఆర్ను చేపట్టనున్నట్లు ఈసీ ప్రకటించింది. Prashanth Kishore EC Notice.
రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1950లోని సెక్షన్ 17 ప్రకార ఏ వ్యక్తికి కూడా దేశంలోని ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉండకూడదని ఎన్నికల అధికారులు చెప్పారు. అయితే ప్రశాంత్ కిషోర్‌కు రెండు రాష్ట్రాల్లో ఓటు ఉండటం ఆయనను చిక్కుల్లో పడేసింది. సొంత పార్టీ పెట్టి బీహార్ ఎన్నికల బరిలో ఉన్న ఆయనకు ఇది రాజకీయంగా కొంత నష్టం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరీ ఏం జరుగుతుందో తెలియాలీ అంటే వేచి చూడాల్సిందే.