
Jubilee hills Constituency: తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీల పంతం చూస్తుంటే.. జూబ్లీహిల్స్ బైపోల్ రాష్ట్ర రాజకీయాలనే మార్చేస్తుందన్నట్లుంది. సిట్టింగ్ సీట్ ను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ ఉంది. ఇక కాంగ్రెస్ కు ఈ బై పోల్ విజయం తన రెండేళ్ల పాలనకు ఒక రెఫరెండం. అర్బన్ లో బలపడుతున్న బీజేపీకి జూబ్లీహిల్స్ లో గెలిస్తే అది బోనస్ అవుతోంది. కాంగ్రెస్ ఖల్లాస్ అని బీఆర్‌ఎస్ అంటుంటే.. అధికారపార్టీకి ఓటమి భయం పట్టుకుందని బీజేపీ అంటోంది. ఇక కాంగ్రెస్ వరుస చూస్తే.. వందకు వందశాతం గెలుపు తమదేనంటోంది. దీంతో ఈ బై పోల్ బస్తీ మే సవాల్ అన్నట్లుగా ఉంది. ఒక్క అడుగు అంటూ.. అదేదో సినిమాలో ప్రభాస్ చెప్పినట్లుగా.. ప్రధాన పార్టీలు ఒక్క నియోజకవర్గం లో గెలిపించండి అంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి. దీంతో రోజుకో తీరుగా సమీకరణాలు మారుతున్నాయి. బ్రాండ్ అంబాసిడర్లు దిగిపోతున్నారు. అన్ని పార్టీల నేతలూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ ఎన్నికను చావోరేవో అన్నట్లే ప్రధాన రాజకీయపక్షాలు తీసుకున్నాయి.
ఓట్ ప్లీజ్ అంటూ ప్రధానపార్టీలు జూబ్లీహిల్స్‌లో ప్రతీ ఇంటి తలుపు తడుతున్నాయి. బస్తీలు, వార్డులను చుట్టేస్తున్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికను మూడుపార్టీలూ సవాలుగా తీసుకున్నాయి. సిట్టింగ్ సీటు కావటంతో సెంటిమెంట్ తో కొడుతోంది బీఆర్‌ఎస్. గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ ఇచ్చిన బీఆర్‌ఎస్‌కి ఈ ఎన్నిక అత్యంత కీలకంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక జరిగిన కంటోన్మెంట్ బైపోల్ లో.. సిట్టింగ్ సీటుని బీఆర్‌ఎస్ దక్కించుకోలేకపోయింది . అందుకే జూబ్లీహిల్స్ విషయంలో ఆ పార్టీ పట్టుదలగా ఉంది. ఎంఐఎం ఈ సారి కాంగ్రెస్ వైపు ఉండటంతో.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది గులాబీపార్టీ. బీఆర్‌ఎస్ ముఖ్యనేతలంతా ప్రచారంలోకి దిగిపోయారు. కేటీఆర్ అక్టోబర్ 31నుంచి నవంబర్ 9వరకు రోడ్ షోలు ప్లాన్ చేసుకున్నారు . Jubilee hills Constituency.
బీసీ అభ్యర్థిని బరిలోకి దించిన అధికారపార్టీ జూబ్లీహిల్స్‌లో విజయం తథ్యమంటోంది. ఎంఐఎం మద్దతుకు తోడు, అజార్‌కి మంత్రి పదవి ఇస్తున్నామనే సంకేతాలతో కీలకమైన మైనారిటీ ఓట్లపై గట్టిగానే గురిపెట్టింది కాంగ్రెస్. వ్యూహాత్మకంగా సినీ కార్మికులతో కూడా సమావేశమయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. మంత్రులు, ముఖ్యనేతలు జూబ్లీహిల్స్‌ని చుట్టేస్తున్నారు. కంటోన్మెంట్ మ్యాజిక్ రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉంది కాంగ్రెస్ నాయకత్వం. ఆ ధీమాతోనే బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీకి సవాల్ విసురుతోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఫైట్‌లో సమీకరణాలు కలిసొస్తే తమకు బోనస్సేననుకుంటోంది బీజేపీ. కమలంపార్టీ ముఖ్యనేతలంతా జూబ్లీహిల్స్ లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదని, రెండేళ్లలో కాంగ్రెస్ హామీలు నిలబెట్టుకోలేకపోయిందని ప్రజల్లోకెళ్తున్నారు. కాంగ్రెస్ మైనారిటీ ఓటర్లపై నమ్మకం పెట్టుకుంటే..దానికి రివర్స్ స్ట్రాటజీలో కమలంపార్టీ నేతలు వెళ్తున్నారు. నవంబరు 11న జరగబోతోంది జూబ్లీహిల్స్ బైపోల్. 58మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. మూడుపార్టీల మధ్యే గట్టి పోటీ నడుస్తోంది. గ్రేటర్ సిటీకి గుండెకాయలాంటి నియోజకవర్గంలో ఎలాగైనా పాగా వేయాలన్న