
BRS Siddipet: సిద్ధిపేట జిల్లాలో ప్రగతి పట్టాలు ఎక్కేనా… వెయ్యి పడకల ఆసుపత్రి అందుబాటులోకి వచ్చేనా…వెటర్నరీ కాలేజీ సిద్ధిపేటకు తిరిగివస్తుందా…ఇప్పుడు ఈ ప్రశ్నలు జిల్లాలోనే మార్మోగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లాపై వివక్ష చూపుతున్నది విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు జిల్లాలో ఏం జరుగుతోంది….తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్పల్లి గ్రామ శివారులో రూ.324 కోట్ల అంచనా వ్యయంతో వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్ 2020 డిసెంబర్లో శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేశారు. ఐదు అంతస్తులతో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు ఒకేచోట అందుబాటులోకి తెచ్చేలా భవనాన్ని నిర్మించారు. మొదట ఆసుపత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్లో డెంటల్ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ మంత్రి హరీశ్‌రావు 2023 అక్టోబర్‌లో ప్రారంభించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం నిధులు కేటాయించకపోవడంతో ప్రభుత్వాసుపత్రి పెండింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా.. 300 పడకలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కొనసాగుతోంది. వెయ్యి పడకల ప్రభుత్వాసుపత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. పేద ప్రజలకు అన్ని విభాగాల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
సిద్దిపేటలో వెయ్యి పడగల ఆసుపత్రి నిర్మాణం పనులు దాదాపు 90% పూర్తికాగా మరో 10% పనులకు నిధులు లేని కారణంగా వైద్య సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదని స్థానికులు వాపోయారు. . అలాగే నర్సింగ్ కళాశాల నిర్మాణం పూర్తయినప్పటికీ మౌలిక మౌలిక వసతులు కల్పించకపోవడంతో వినియోగంలో లేదన్నారు. మరో రూ. 25 కోట్ల నిధులు ఖర్చుచేస్తే ఆసుపత్రి అందుబాటులోకి తేవచ్చన్నారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఇన్ని నెలలు కావొస్తున్న పనుల్లో పురోగతి కరువైందన్నారు.
ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట గజ్వేల్ దుబ్బాక ప్రాంతాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ బెజ్జంకి కోహెడ మండలాలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చేర్యాల మద్దూరు మండలాలను కలిపి కొత్త జిల్లాగా రూపాంతరం చెందింది. సిద్దిపేట గజ్వేల్ హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లో 23 మండలాలతో సిద్దిపేట జిల్లా ఆవిర్భవించింది. తర్వాత దుర్మిట మండలం కుకునూరు పల్లి మండలం భూంపల్లి అక్బర్ పేట మండలం ఏర్పాటు చేసుకోవడంతో మండలాల సంఖ్య 26 కు చేరింది. BRS Siddipet.
జిల్లా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా ఉంది. అస లు ప్రభుత్వం ఉందా..? అన్న అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌లు ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించే విధంగా కృషి చేసి ప్రగతి పరుగులు పెట్టించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు