లోకేష్ ఆన్ డ్యూటీ..?!

Spread the love

Nara Lokesh: మొంథా తుఫాను ఏపీలో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ విపత్తు నుంచి పాణా నష్టం జరగకుండా కూటమి సర్కార్ చర్యలు తీసుకుంది.ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పేరు ఎక్కువగా హైలెట్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏం చేశారు..? తుఫాన్ ను ఎదుర్కొనేందుకు లోకేష్ పెట్టిన ఎఫార్ట్స్ ఏంటి..? మొంథా తో ప్రత్యర్థుల నోటీకి తాళం వేయ్యగలిగారా..? అనేది ఈ స్టోరీలో చూద్ధాం.

మొంథా తుఫాన్.. ఏపీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. వాతావరణ హెచ్చరికలతో ఈ నెల 23 నుంచి కూటమి ప్రభుత్వం అలర్ట్ గా ఉంది. ఇటు అస్ట్రేలియా పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేషన్ అయితే.. మొంథా తుఫాన్ పైనే మొత్తం ఫోకస్ పెట్టారు. ముందస్తు చర్యలు తీసుకున్నారు. మొత్తంగా ఈ తుఫాన్ కారణంగా 9 జిల్లాలు ఎఫెక్ట్ అయ్యాయి. అంతకంటే ముందు ప్రాణా నష్టం జరగకుండా మంత్రి లోకేష్ కు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అన్ గ్రౌండ్ లో అందరు ఉండేలా చూడడం లోకేష్ కీలక పాత్ర పోషించారు. అవసరం అనుకుంటే ఆర్మీని దించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ అందరు గమనించాల్సిన విషయం ఏటంటే.. సీఎం చంద్రబాబు కష్టాలను, నష్టాలనే అవకాశాలుగా మార్చుకుంటారు.

లోకేష్ సైతం ఇదే దారిలో వెళ్తున్నారు. అందుకే తుఫాన్ సమయంలో లోకేష్ సైతం స్మార్ట్ గా వర్క్ చేశారు. తుఫాన్ అంటూ ప్రజలు భయపడుతున్న సమయంలో తండ్రి వరుసగా మీటింగ్స్ చేస్తుంటే.. లోకేష్ తన టీమ్ ను రంగంలోకి దింపి ప్రజలకు అవగహన కల్పించారు. అంతేకాకుండా ప్రెస్ మీట్లు పెట్టి.. ప్రజలు మరింత సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. లోకేష్ ఒక మంత్రిగానే కాదు.. ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత కలిగిన ప్రతినిధిగా వ్యవహారించిన తీరు అందర్ని ఎంతగానో ఆకట్టుకుంది. మొంథా తుఫాన్ బాధ్యతను లోకేష్ తీసుకొని.. 9 జిల్లాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశారు. అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో కూడా ఆయన సమన్వయం చేశారు.

తుఫాన్ లు, వరదలు వచ్చిన సమయంలో చంద్రబాబు వ్యవహారించే విధానానికి ఒక పేరు ఉంది. ఇలాంటి విపత్తులు సంబంధించిన సమయంలో ఆయన.. ఇంటికి కూడా వెళ్లరు అని.. లోకేష్ సైతం గత మూడు రోజుల నుంచి సచివాలయానికే పరిమితం అయ్యారు. అధికారులకు ఎప్పటికప్పుడు ఫోన్ లు చేస్తూ.. వారికి దగ్గరి నుంచి సమాచారాన్ని సేకరించడమే కాకుండా.. తగిన సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సైతం మాట్లాడి.. విపత్తు ఎక్కువగా ఉంటే కావాల్సిన సహకారులు అందించాలని కొరినట్లు తెలుస్తోంది. Nara Lokesh.

ఇలా మంగళవారం రాత్రంతా లోకేష్ కూడా సచివాలయంలోనే ఉన్నారు. తీరం దాటిన తర్వాత కూడా అధికారులకు సంబంధించిన సహయకచర్యలను మానిటర్ చేశారు. అంతేకాకుండా మీడియా ముందుకు వచ్చి.. 9 జిల్లాల ప్రజలకు భరోసా కూడా కల్పించారు. దీంతో లోకేష్ ఈ తుఫాన్ సమయంలో వ్యవహారించిన తీరును చూసిన వాళ్లంతా పవర్ లోనే కాదు..సంక్షోభం వస్తే ఎదుర్కొవడంలో ముందుడడంలో కూడా తండ్రితగ్గ తనయుడు అనిపించుకుంటున్నారని మెచ్చుకుంటున్నారు. ఓవరాల్ గా ఈ మొంథా తుఫాన్ సమయంలో లోకేష్ చేసిన గ్రౌండ్ వర్క్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయ్యండి.