“మాస్ జాతర” మూవీ రివ్యూ

Spread the love

Mass Jathara Review:నటీనటులు: రవితేజ, శ్రీలీల,నవీన్ చంద్ర,నరేష్,రాజేంద్ర ప్రసాద్,వీటివి గణేష్,హైపర్ ఆది తదితరులు
ప్రొడ్యూసర్: నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకుడు: భాను భోగవరపు
మ్యూజిక్: భీమ్స్ సిసిరిలియో
మాటలు: నందు సావిరిగణ
సినిమాటోగ్రఫర్: విధూ అయ్యన్న
ఎడిటింగ్: నవీన్ నూలీ
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్
విడుదల తేదీ: అక్టోబర్ 31,2025

మాస్ మహారాజా రవితేజ సినిమా అంటే ప్రత్యేకంగా మాస్ ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ రవితేజ సరైన హిట్టు కొట్టి చాలా కాలమైంది. ఈసారి మాస్ జాతర తో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు రవితేజ. భాను భోగవరపు దర్శకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇంత భారీ బడ్జెట్ సినిమా నిర్మించినప్పటికీ ప్రమోషన్స్ విషయంలో కాస్త స్లో అయ్యారని చెప్పాలి. విడుదల తేదీని ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చిన మేకర్స్ ఎట్టకేలకు ఈ అక్టోబర్ చివర్లో సినిమాను విడుదల చేశారు. రవితేజ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి మాస్ జాతర ఎలా ఉంది? రవితేజ మళ్లీ హిట్టు కొట్టాడా?…. ఈ రివ్యూ లో చూద్దాంMass Jathara Review

కథ:
రవితేజ ( భేరి లక్ష్మణ్) రైల్వే డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్గా పని చేస్తారు. ఎక్కడ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోవడం తన వల్ల కాక ఆ కారణంతో ట్రాన్స్ఫర్లు తరచూ జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలోని అడవి వరకు ట్రాన్స్ఫర్ అవుతాడు. ఆ ఊరిలో శివుడు (నవీన్ చంద్ర) అక్కడ ఉన్న జనంతో గంజాయి పండిస్తూ ఉండేవాడు. అది చూసిన రవితేజ అతనితో గొడవ పెట్టుకుంటాడు. ఒకరోజు నవీన్ చంద్ర అమ్మాలని చూసిన గంజాయి లోడ్ ని మాయం చేస్తాడు రవితేజ. వీళ్ళిద్దరి మధ్య కథ ఎలా సాగుతుంది? శ్రీ లీల పాత్ర ఏంటి? రవితేజ, శ్రీ లీల కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఊహించని ట్విస్ట్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
కథపరంగా చూసుకున్నట్లయితే రొటీన్ గా అనిపించినా, స్క్రీన్ ప్లే లో వైవిధ్యం కనిపించింది. ముందు నుంచి చాలా సినిమాలకు పని చేసిన అనుభవం ఉన్న భాను భోగవరపు, మాస్ జాతర లో అన్ని ఎలిమెంట్స్ ని టచ్ చేశారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ని జోడించి రవితేజ మాస్ ఫ్యాన్స్ కి ఒక మాస్ ఎంటర్టైనర్ ను అందించాడు. ఈ సినిమాలో ఫైట్స్ ను మాత్రమే హైలైట్ చేసినట్లు అనిపించింది. కథపరంగా ఇంకొంచం ఆకట్టుకుంటే బాగుండేది అనిపించింది.అన్యాయాన్ని ఎదిరించడానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఎన్ని కష్టాలు పడతాడు అనే స్టోరీ లైన్ తో సాగిన ఈ మాస్ జాతర మాస్ ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోయింది. శ్రీలీల, రవితేజ డాన్స్ స్టెప్స్ కి థియేటర్స్ లో ప్రశంసలు వస్తున్నాయి. నవీన్ చంద్ర విలన్ గా తన పాత్రకు న్యాయం చేశాడు.కామెడీ పరవాలేదు అనిపిస్తుంది.అటు మాస్ ను ఇటు క్లాస్ ను ఆకట్టుకునే ప్రయత్నం సఫలమైంది అనే చెప్పాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన సినిమా కాబట్టి ఎప్పటి లానే భారీ నిర్మాణ విలువలు కనిపించాయి.మొత్తంగా “మాస్+క్లాస్ = మాస్ జాతర” వర్కవుట్ అయింది అనిపించింది..

Mega9 TV Rating:
మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్
Rating: 3/5