ఇక ఎడారే.!

Spread the love

Afghanistan Kunar River Dam: పాకిస్తాన్‌ త్వరలోనే ఎడారిలా మారే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సిందూ నదీ జలాలను నిలిపేసి పాకిస్తాన్‌ను భారత్ పెద్ద దెబ్బ కొట్టింది..ఇప్పుడు ఇదే సీన్ రిపీట్ కానుంది. ఆఫ్గనిస్థాన్ కూడా అదే రకమైన వైఖరి అవలంబిస్తోంది. ఈ క్రమంలోనే ఆఫ్గనిస్థాన్ నుంచి పాకిస్తాన్‌కు ప్రవహించే కీలక నదిపై డ్యామ్ నిర్మిస్తుంది. అయితే ఈ డ్యామ్ నిర్మాణానికి భారత్ మద్దతు ప్రకటించింది. దీంతో పాకిస్తాన్‌కు ఇప్పుడు ఊపిరి సలపకుండా మారింది. ఇటు భారత్ అటు ఆప్ఘనిస్తాన్… పాకిస్తాన్ కు డబుల్ షాకే ఇచ్చింది.

భారత్ మీద కోటి టన్నుల విషం కక్కుతూ ఎగిరెగిరి పడిన పాక్ కి ఇపుడు అసలు పరిస్థితి బాగులేదు. ఏ మాత్రం కూడా ఆశాజనకంగా వాతావరణం అయితే లేదు. చీటికి మాటికి భారత్ మీద కయ్యానికి కాలు దువ్వడం కాదు తమ మీదకు సమస్యలు అన్ని వైపుల నుంచి వస్తే ఎలా ఉంటుందో పాక్ ఇపుడు స్వయంగా చూస్తోంది, అనుభవిస్తోంది. ఇంటా బయటా పాక్ కి ఇపుడు సంక్షోభాలే దర్శనం ఇస్తున్నాయి. భారత్ తో పెట్టుకున్నందుకు సింధు నదీ జలాలు ఆగిపోయాయి. దాంతో ఒక వైపు గొంతు ఎండుతోంది. ఇపుడు దానికి తోడు ఆఫ్ఘనిస్తాన్ తయారు అయింది.

ఆఫ్ఘనిస్థాన్ వైపు నుంచి పాకిస్థాన్ వైపుగా ప్రవహించే ఒక నది ఉంది. ఆ నది మీద ఆఫ్ఘనిస్తాన్ ఇపుడు ఒక భారీ డ్యామ్ కట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ డ్యామ్ కడితే కనుక పాక్ పూర్తిగా ఏడారిగా మారడం ఖాయమని అంటున్నారు. ఇంతకీ ఆ నది పేరు ఏమిటి అంటే కునార్ . దీని మీదనే ఒక డ్యామ్ ని కట్టి పాక్ గొంతునే ఎడారి చేయడానికి తాలిబన్ ప్రభుత్వం చూస్తొంది. ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వ అధినేత మౌలవీ హిబతుల్లా అఖుంద్‌జాదా ఆదేశాలు జారీ చేశారు. ఈ నదీ జలాలను తాము పూర్తిగా ఉపయోగించుకుని జలవిద్యుత్ ప్రాజెక్టులతో సహా స్థిరమైన నీటి నిర్వహణ కోసం ఆఫ్ఘన్ ప్రభుత్వం కృషి చేస్తోంది.

దక్షిణాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరిహద్దుల నుంచి.. నీటి వనరుల వైపు మళ్లాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌తో సింధూ జలాల ఒప్పందంపై కఠిన వైఖరి తీసుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ కూడా అదే బాటలో నడుస్తోంది. పాకిస్తాన్‌లోకి ప్రవహించే ముఖ్యమైన నది అయిన కునార్ నదిపై వీలైనంత త్వరగా డ్యామ్ నిర్మించాలని తాలిబాన్ అధినేత మౌలవీ హిబతుల్లా అఖుంద్‌జాదా ఆదేశాలు జారీ చేశారు. ఇక జలవిద్యుత్ ప్రాజెక్టులతో సహా స్థిరమైన నీటి నిర్వహణ ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు.

ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఒక విధానం అనుసరిస్తోంది. కునార్ నది మీద నిర్మించే ఈ డ్యామ్ కోసం విదేశీ కంపెనీలని పిలవడం లేదని టాక్ వినిపిస్తుంది. తామే దేశీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని వీలైనంత త్వరగా ప్రాజెక్టును ప్రారంభించాలని చూస్తోంది. ఈ మేరకు ఆ దేశ మంత్రి అబ్దుల్ లతీఫ్ మన్సూర్ కి తాలిబాన్ అధినేత నుంచి ఆదేశాలు వెళ్ళాయని అంటున్నారు. ఇక ఈ నదీ జలాల విషయానికి వస్తే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతానికి అత్యంత కీలకంగా ఉన్నాయి. ఈ నదిపై ఆఫ్ఘనిస్తాన్ డ్యామ్ నిర్మిస్తే కనుక పాకిస్తాన్ ఇప్పటికే ఎదుర్కొంటున్న జల సంక్షోభం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇక ఈ కునార్ నది మీద నిర్మించే డ్యాం విషయంలో ఆఫ్ఘాన్ కి తాము మద్దతు ఇస్తామని భారత్ చెబుతోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇదే విషయం మీద కీలక ప్రకటన ఢిల్లీ నుంచి చేశారు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత్ గతంలో కూడా ఎంతో సాయం చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో హెరత్ ప్రావిన్స్‌లో సల్మా ఆనకట్టను నిర్మించిన విషయాన్ని కూడా రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కునార్ డ్యామ్‌కు భారత్ మద్దతు ఇవ్వడం.. పాక్-ఆఫ్ఘాన్ వైరాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని నిపుణులు అంటున్నారు. నది కాబూల్ నదితో కలిసి పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతానికి జీవనాధారంగా ఉంటుంది. ఈ డ్యామ్ నిర్మాణం వల్ల పాకిస్తాన్ దశాబ్దాల్లోనే అత్యంత తీవ్రమైన జల సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరత్ ప్రావిన్స్‌లో సల్మా డ్యామ్‌ను భారత్‌ నిర్మించింది. ఇక కునార్ డ్యామ్ నిర్మాణంలో కూడా భారత్ సహకారం అందిస్తే.. అది 2 దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసి.. వ్యూహాత్మకంగా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచుతుందని భావిస్తున్నారు. కునార్ నది కాబూల్ నదితో కలిసి.. ఆ తర్వాత పాకిస్తాన్‌లోకి చిత్రాల్ నదిగా ప్రవేశిస్తుంది. చివరికి ఇది సింధూ నదిలో కలిసి.. అరేబియా సముద్రంలో కలుస్తుంది. కాబూల్ నదిలోకి చేరే నీటిలో ఎక్కువ భాగం పాకిస్తాన్‌ వినియోగించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజా ఘర్షణలతో తమ నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తుండటంతో.. పాకిస్తాన్‌కు రానున్న రోజుల్లో నీటి సమస్య పెను సవాలుగా మారనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే, భారత్ ఆఫ్ఘనిస్తాన్‌లో పలు డ్యాములను నిర్మించింది. హెరాత్ ప్రావిన్సులో సల్మా ఆనకట్టను నిర్మించింది. ఈ విషయాన్ని కూడా జైస్వాల్ గుర్తు చేశారు. కునార్ నది కాబూల్ నదితో కలిసిన తర్వాత పాకిస్తాన్‌లోకి ప్రవేశిస్తుంది. దీనిని పాకిస్తాన్ లో చిత్రాల్ నదిగా పిలుస్తారు. ఆ తర్వాత ఇది సింధూ నదిలో కలిసి, అరేబియా సముద్రంలో కలుస్తుంది. కాబూల్ నదిలో ఎక్కువ నీరు పాకిస్తాన్‌కు చేరుతోంది. ముఖ్యంగా, పాక్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతం ఈ నది జలాలతో లాభపడుతోంది. Afghanistan Kunar River Dam.

ఇదిలా ఉంటే కునార్ మీద నిర్మించే డ్యాం విషయంలో భారత్ మద్దతు ఇవ్వడం ద్వారా . పాక్-ఆఫ్ఘాన్ వైరాన్ని మరింతగా పెంచే విధంగా రాజనీతిని ప్రయోగించారు అని అంటున్నారు. కునార్ నది కాబూల్ నదితో కలిసి పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతానికి జీవనాధారంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇపుడు ఆఫ్ఘాన్ ఈ నది మీద అడ్డుకట్ట వేస్తే కనుక పాకిస్తాన్ తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ముప్పు పొంచి ఉందని అంటున్నారు.