
Bhupesh Reddy Jammalamadugu Constituency: గడిచిన ఐదేళ్ల పార్టీ కోసం పార్టీ బలోపితం కోసం ఎంతో కృషి చేశారు. తీరా గెలిచే సీటును అధిష్టానం ఒత్తిడితో చేయిజార్చుకున్నారట. తాను గెలిచి కేడర్ కి న్యాయం చేస్తానన్న ఆలోచనలో ఉన్న నేతని కాదని లాస్ట్ మూమెంట్లో ఆ సీటు వేరే వాళ్ళు అధిష్టానం కట్టబెట్టిందట. ఇప్పుడు నేత పరిస్థితి ఏంటి నేత గతి ఏంటి అంటూ తీవ్ర ఆవేదంలో ఉంటున్న ఆ టిడిపి నేత ఎవరు ఇంతకీ ఏంట నియోజకవర్గం వాచ్ థిస్ స్టోరీ.
ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గం జమ్మలమడుగు. ఏపీ పాలిటిక్స్ లో ఎప్పుడు ప్రత్యేకత ఉంటుంది ఈ నియోజకవర్గానికి. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు ఈ నియోజకవర్గంకు. పార్టీ ఏదైనా సరే కార్యకర్తలు ప్రాణాలకు సైతం తెగిస్తారు. కార్యకర్తలు తన నేత కోసం ఎంత దాకైనా వెళ్తారా అక్కడ. నాయకులు కూడా ఆ నియోజకవర్గంలో కార్యకర్తల కోసం ఎంతవరకైనా నిలబడతారు. అందుకే ఈ నియోజకవర్గ ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డా అని పేరుందింది.అయితే 2014లో వైసీపీ నుండి గెలిచిన ఆదినారాయణ రెడ్డి టిడిపిలో చేరి మంత్రి అయ్యాక జమ్మలమడుగు రాజకీయం మారింది. అయితే 2019 ఎన్నికల్లో ఘోరపరాజ్యమైన ఆదినారాయణ రెడ్డి అనంతరం బిజెపి పార్టీలో చేరడం అప్పటినుంచి బిజెపి పార్టీలోనే యాక్టివ్ గా కొనసాగుతూ వచ్చారు ఆదినారాయణ రెడ్డి. నియోజకవర్గంలో అప్పటివరకు ఆడపాదప వస్తూపోతూ తన ఉనికిని చాటుకుంటూ ఉండేవారు. అయితే అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకోవడంతో జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు బిజెపి పార్టీ కైవసం చేసుకోవడంతో ఆ సీటుని ఆదినారాయణ రెడ్డికి కేటాయించారు టీడీపీ అధిష్టానం. Bhupesh Reddy Jammalamadugu Constituency.
అయితే వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాలు టిడిపి ఉనికినే పూర్తి కోల్పోయిన సమయంలో పార్టీని భుజాన వేసుకొని టిడిపి ఉనికి కోసం తన సాయిశక్తుల ప్రయత్నం చేసి పార్టీని ప్రతిష్టంగా నిలిపారు భూపేష్ రెడ్డి. అయితే 2024 ఎన్నికలలో జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు ఆదినారాయణ రెడ్డి దక్కించుకోవడం అలాగే అఖండ మెజారిటీతో గెలుపొందడం చక చక జరిగిపోయాయి.కూటమీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూపేష్ రెడ్డికి ఏ పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. కష్టకాలంలో టిడిపి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన నన్ను పార్టీ మరిచాదని ఆవేదనలో ఉన్నారట. అదే సమయంలో నా సీటు తన్నుకు పోయిన బాబాయ్ ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ విప్పు చేపట్టి ఫుల్ జోసుగా ఉన్నారు. బాబాయ్ కి పదవాలు దక్కాయిని ఆనందం గా ఉండాలో నాకు పదవి దక్కలేదని ఏడవలో భూపేష్ కి అర్థం కాని గందరగోళంలో ఉన్నారట. మరోవైపు కేడర్ సైతం ఆదినారాయణ రెడ్డి చుట్టూ చేరడంతో తన ప్రాధాన్యత నియోజకవర్గంలో తగ్గుతుందని బాధను కూడా భూపేష్ రెడ్డి కి వెంటాడుతుందని చెప్పుకుంటున్నారు విశ్లేషకులు.
అయితే ఏపీలో మూడు విడతలలో నామినేటెడ్ భర్తీ జరగగా అసలు ఎక్కడ భూపేష్ ఊసే లేదాట.. పార్టీ బేలోపేతం కోసం పనిచేసిన నేతల్ని ఆదుకుంటామని ఆనాడు సీఎం చంద్రబాబు చెప్పడంతో నామినేటెడ్ పోస్టులపై భూపేష్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఈ విషయం ఆలస్యమయ్యకొద్ది బాబాయి అబ్బాయి మధ్య మనస్పార్ధాలు వస్తున్నాయట. ఈ మధ్యకాలంలో నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న సంఘటనలే ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారట. మరి బాబాయి అబ్బాయిల మధ్య వార్ మొదలుకాకమునుపే టిడిపి అధిష్టానం భూపేష్ రెడ్డికి ఏదైనా పదవి కట్టబెడతారా లేదా మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.