ఆ నియోజకవర్గం లో టీడీపీకి దిక్కు ఎవరు..?

Spread the love

The ruling party’s constituency: అధికార పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి అంటే దాదాపు ఎమ్మెల్యేతో స‌మానం. అయితే ఆ నియోజ‌వ‌ర్గంలో మాత్రం ఏడాది కాలంగా అధికార పార్టీని న‌డిపించే నాయ‌కుడే లేడు. నియోజ‌క‌వ‌ర్గంలోని నేతలతో పాటు రెండు సామాజిక వ‌ర్గాల మ‌ధ్య కొన‌సాగుతున్న అధిప‌త్య పోరులో ఆ నియోజ‌క‌వ‌ర్గం టిడిపి క్యాడ‌ర్ న‌లిగిపోతోంది. ఎవ‌రికి ఇన్‌చార్జి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాల‌న్న విష‌యంలో అధికార పార్టీ అధిష్టానం కూడా ఓ నిర్ణ‌యానికి రాలేక‌పోతోంది. ఏంటా నియోజ‌క‌వ‌ర్గం.వాచ్ దిస్ స్టోరీ.

రాష్ట్రంలో కూట‌మి అన్నిచోట్లా విజ‌యం సాధిస్తే అన్న‌మ‌య్య జిల్లా రాజంపేట‌లో మాత్రం గెలుస్తామ‌నుకున్న సీటు చేజారి పోయింది. ఆ సీటు మ‌ళ్ళీ వైసిపీ ఖాతాలోనే ప‌డిపోయింది. ఎన్నిక‌ల సంద‌ర్బంలో రాజంపేట టిడిపి గెలిచి తీరుతుంద‌ని అంద‌రు భావించారు. కానీ చివ‌రి నిముషంలో రాయ‌చోటికి చెందిన సుగ‌వాసి బాల‌సుబ్ర‌మ‌ణ్యంను రాజంపేట ప్ర‌క‌టించి టిడిపి ఒక ర‌కంగా చేయి కాల్చుకుంద‌నే చెప్పాలి. అప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో చురుగ్గా పార్టీ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించిన మాజీ ఎమ్మెల్సీ బ‌త్యాల చంగ‌ల్‌ర్రాయుడును కాద‌ని సుగ‌వాసికి ఇవ్వ‌డంతో ఇక్క‌డ బ‌లిజ సామాజిక వ‌ర్గ నేత‌లు టిడిపి అభ్య‌ర్థికి హ్యాండిచ్చారు. దీంతో వైసిపికీ ఈ సీటు క‌లిసి వ‌చ్చింది. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమ‌ర్‌నాథ్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీనికి రాజంపేట టిడీపీలో ఉన్న అంత‌ర్గ‌త విభేదాలే కార‌ణం. The ruling party’s constituency.

ఎన్నిక‌ల్లో ఊహించ‌ని రీతిలో గెలిచి అధికారం చేజిక్కిచుకున్నా కూట‌మి ప్ర‌భుత్వం అన్న‌మ‌య్య జిల్లా రాజంపేట‌లో మాత్రం పార్టీ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌లేక‌పోతోంది. రాజంపేట టిడిపి ఇన్చార్జ్ వ్య‌వ‌హారంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య పెద్ద వారే న‌డుస్తోంది. దీనికోసం నేతల మధ్య పోటీ బాగానే క‌నిపిస్తోంది. నియోజకవర్గం ఇన్చార్జ్ రేసులో బత్యాల చెంగల్రాయుడు, జగన్ మోహన్ రాజు, బాలిశెట్టి హరిప్రసాద్, మేడా విజయ శేఖర్ రెడ్డిలు క‌నిపిస్తున్నారు. అయితే ఎన్నికల ముందు ఐదేళ్ల పాటు నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన బత్యాల చెంగ‌ల్‌రాయుడుకే మ‌ళ్లీ అవ‌కాశం క‌ల్పించాల‌ని ఆసామ‌జిక వ‌ర్గ నేత‌లు అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక 2024 ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం ఇటీవ‌ల పార్టీకి రాజ‌నామా చేసి వైసిపిలో చేరారు. దీంతో ఇక పార్టీలో ఇత‌ర ప్రాంత నేత‌లు లేర‌ని, ఇన్‌ఛార్జిని ఎంపిక చేసే వ్య‌వ‌హారం త్వ‌ర‌గా తేల్చాలంటూ ప‌ట్టుప‌డుతున్నారు. త‌మ నేత‌నే ఇన్చార్జ్ అంటూ బత్యాల, మ‌రోవైపు ఇటీవల తెరపైకి వచ్చిన హరిప్రసాద్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇంకోవైపు ఇన్చార్జ్ పదవి కోసం రాజంపేట పార్ల‌మెంటు టిడిపి ఇన్‌చార్జి చ‌మ‌ర్తి జగన్ మోహన్ రాజు కూడా తీవ్రంగానే ప్ర‌య‌త్నిస్తున్నారు. బ‌లిజ‌ల‌కే నియోజకవర్గంఇన్చార్జి పదవి ఇవ్వాలంటూ అధిష్టానంపై ప‌రోక్షంగా వ‌త్తిడి తెస్తున్నారట.

రాజంపేట ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గం. ఈ నియోజకవర్గం రాజ‌కీయ ప్ర‌భారం ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలపై కూడా ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో హేమాహేమీలు పోటీ చేసిన పార్లమెంట్ నియోజకవర్గం కూడా రాజంపేటే. అలాంటి నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో ఆ సామాజ‌కవ‌ర్గం ఇన్‌చార్జి ప‌ద‌వి త‌మ‌కే కావాలని కోరుతోంది. ఏడాది కాలంగా ఇన్‌చార్జి లేకుండా పార్టీ న‌డ‌వ‌డం ఓకటైతే, సుగ‌వాసి బాల‌సుబ్ర‌మ‌ణ్యం రాజీనామాతో మ‌రోమారు రాజంపేట ఇన్‌చార్జి వ్య‌వ‌హారం జటిలంగా మారింది.

మరోవైపు రాజంపేట టిడిపి ఇన్చార్జ్ వ్యవహారం అన్నమయ్య జిల్లాలో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. రాజంపేట రాజకీయాల్లోకి రావాల‌ని చూస్తున్న హరిప్రసాద్ మీద స్తానిక కేడర్ వ్యతిరేకంగా ఉందట. అంతేకాక త‌మ సామాజిక వ‌ర్గానికే ఇవ్వాల‌న్న డిమాండ్‌తో ఇతర సామాజిక వర్గాలు పార్టీకి దూరం అయ్యే ప్ర‌మాదం ఉన్న‌ట్లు తెలియ‌డంతో అధిష్టానం ఈ వ్య‌వ‌హారంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంద‌ట‌. 2014లో టిడిపి నుంచి 2019లో వైసిపి నుంచి మేడా మల్లికార్జున రెడ్డి పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసిపి నుంచి గెలిచారు. బలిజ సామాజిక వర్గం నుంచి టిడిపిలో బలమైన నేతలు ఉన్నప్పటికి సుగవాసి ఓటమి చెందడం టిడిపి కుల సమీకరణపై ఆలోచించుకోవాలనే వాదన బ‌లంగా వినిపిస్తోంది. అంతేకాదు, రాజ‌కీయ, సామాజిక స‌మీక‌ర‌ణాలతో పాటు అందరినీ ఒక్కతాటిపై తీసుకొచ్చే నేతనే ఎంపిక చేయాలని పార్టీ కేడర్ కోరుతోందట.

Also Read: https://mega9tv.com/andhara-pradesh/pemmasani-chandra-sekhar-guntur-district-union-minister-has-full-filling-his-manifesto-promises/