పంచాయతీ రాజ్ శాఖను ప్రగతి పథంలో నడిపిస్తున్న పవన్ కు అభినందనలు

Spread the love

గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం దక్కుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాజాగా  దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2025, నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ పురస్కార్-2025 అవార్డుల్లో జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని రాష్ట్రం దక్కించుకోవడంపై ఆయన స్పందించారు. ఇది గర్వకారణమని అన్నారు.  పంచాయతీ రాజ్ శాఖను అత్యంత సమర్థవంతంగా తీర్చిదిద్ది ప్రగతి పథంలో నడిపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు  అభినందనలు తెలిపారు. వివిధ విభాగాల్లో అవార్డులను గెలుచుకున్న శృంగవరం, బొక్కసంపాలెం, చెముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలకు నా శుభాకాంక్షలు. దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శుభాభినందనలు తెలిపారు. 

సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని మోడీ: 

ప్రధాని మోడీ హైదరాబాద్ లోని సీఎం చంద్రబాబు  నివాసానికి వెళ్లారు. సీఎం చంద్రబాబు ఆయన సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేష్, కోడలు శ్రీమతి నారా బ్రాహ్మణి, మనుమడు మాస్టర్ నారా దేవాన్ష్ ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *