కొత్త ఆవిష్కరణ..
వన్స్ He స్టెప్ ఇన్ అభివృద్ధి అయిన.. సమస్య అయిన పూర్తి కావాల్సిందే. అసలు అవదు అంటే.. ఆయన ఫీల్డ్ లోకే దిగడు. ఇది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టైల్. అదే దూకుడు.. అదే స్టైల్ కాకపోతే చిన్న రోల్ ఛెంజ్ అంతే.. అప్పుడు పార్టీ అధినేత.. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం. అయిన కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. తమ పాలనలో దూకుడు పెంచారు. ప్రజా పాలన అంటే ఇదే అనిపించేలా ఆయన నిర్ణయాలు ఉంటాయి. కొత్త కొత్త ఆవిష్కరణాలతో..ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు మంచి స్పందన వస్తోంది. ఇంతకీ పవన్ కొత్తగా తీసుకున్న నిర్ణయాలు ఏంటి..? పల్లెపండగ 2.0 లో ఏలాంటి ఆవిష్కరణాలు తీసుకురాబోతున్నారు..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధిలో దూసుకెళ్తున్నారు. ఆయన తీసుకున్న శాఖలను సరైన పద్దతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. మారు మూల గ్రామాలను సైతం బయటకు తెస్తున్నారు. ఇప్పటికే పల్లె పండుగలో భాగంగా మంచి స్వచ్చమైన తాగు నీరును అందించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు పల్లెపండుగ 2.0 లో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తన ప్రతి అడుగూ ఆ దిశగానే ఉంటున్నాయి. జల్ జీవన్ మిషన్, పల్లె పండగ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నారు. జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. సాస్కీ నిధుల సాయంతో పల్లె పండగ 2.0ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పవన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పల్లె పండగ 2.0 లో భాగంగా అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్ర పథకాలపై కూడా పవన్ పోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నిధులు అందుబాటులో ఉన్నా పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారట. అడవి తల్లిబాట, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంకు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని పవన్ ఇప్పటికే అధికారులు చెప్పారని సమాచారం. మనం ప్రయాణం చేసే మార్గంలో రోడ్డు ఉందా..? లేదా..? ఉంటే ఎలా ఉంది..? అనే వివరాలు ప్రజల చేతిలో అందుబాటులో ఉండే వ్యవస్థను తీసుకురావాలి. అసలు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని రహదారులు ఉన్నాయి..? అవి ఎలా ఉన్నాయి..? అనే వివరాలు కూడా ప్రతి ఒక్కరికీ తెలియాలి. కొత్త రహదారి నిర్మిస్తే అందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటలోకి రావాలనే ఉద్దేశ్యంతోనే ఈ కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు.
అంతేకాకుండా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని, రహదారులను మెరుగుపరచుకునేలా ఈ సాంకేతికత ఉండాలని.. ఈ విధంగా జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంను త్వరితగతిన అభివృద్ధి చేయండి. అధునాతన సాంకేతికత సాయంతో ఆ విధమైన వ్యవస్థకు రూపకల్పన చేయండి. 48 గంటల్లో అందుకు సంబంధించి ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం కావాలి. ఒక వర్కింగ్ గ్రూప్ రూపొందించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందులో పొందుపరచాలి. ఈ అంశంలో అర్టీజీఎస్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి. అడవి తల్లి బాటను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంచుకుని ఈ సిస్టంకు అనుసంధానించండని పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. అడవి తల్లిబాట పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. ఎక్కడైనా అటవీ శాఖతోగాని, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయికి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించాలని సూచించారు. తక్షణం పల్లె పండగ 2.0ని పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇలా తన పరిధిలో ఉన్న శాఖల అభివృద్ధిలో వేగం పెంచారు. అయితే తమ వైపు నుంచి దూకుడుగా ఉంటునే పార్టీని సైతం పటిష్టం చేసుకునే పనిలో పడ్డారు. దీంతో పవన్ మొదలు పెట్టారంట ఖచ్చితంగా జరిగి తీరుతుందని.. జనసైనికులు మాత్రమే కాదు.. టీడీపీ, బీజేపీ నాయకులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు.