తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయంలో సహచర మంత్రి శ్రీధర్ బాబుతో పాటుగా ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెల 5న హైదరాబాద్ లో జరగనున్న ఆయన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామాత ఆశీస్సులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, అమ్మ దయా కరుణా కటాక్షాలతో తెలుగు రాష్ట్రాలు శాంతి, సుభిక్షాలతో మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ అధికారులు అందించిన ఆత్మీయ స్వాగతానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.