బీజేపీని ఎదురించి నిలబడే దమ్మున్న ఏకైక పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రమే:వై.ఎస్.షర్మిల 

Spread the love

రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు-జగన్-పవన్ అని ముగ్గురు బీజేపీకి బానిసలేనని ఏపీసీసీ ఛీఫ్ షర్మిల విమర్శించారు. స్వార్థ రాజకీయాలు తప్పా, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ వై.ఎస్. కలల ప్రాజెక్ట్ అని  36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ అని పేర్కొన్న ఆమె బీజేపీ ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తుంటే, గ్రావిటీ ప్రాజెక్టును కాస్త ఎత్తిపోతల స్కీంలా మారుస్తుంటే, పార్లమెంట్ లో ప్రశ్నించే ఒక్క మగాడు కూడా లేడని మండిపడ్డారు.  పోలవరాన్ని ఖూనీ చేయొద్దని అడిగే దమ్ము ఒక్క ఎంపీకి లేదు. ఇదెక్కడి అన్యాయం ? అని ప్రశ్నించారు. బీజేపీకి వంగి వంగి ఎందుకు గులాం గురి చేస్తున్నారు ? మోడిగారు రాష్ట్రానికి చేసిన మేలు గుండుసున్నా. దేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది. మనకు మాత్రం చేతిలో చిప్ప ఉందని రాజధానికి నిధుల బదులు అప్పులిస్తున్నారని విమర్శించారు. అప్పులెందుకని చంద్రబాబు అడగరు. ప్రశ్నించాల్సిన జగన్ మోహన్ రెడ్డి నోరు మెదపరని ఆక్షేపించారు.  రాష్ట్ర బిడ్డలు ఉద్యోగాలు లేక రోడ్లమీద తిరుగుతున్నారు. ఆటోలు తోలుకుంటున్నారు. అయినా పాలకులకు చీమ కుట్టినట్లైనా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీని ఎదురించి నిలబడే దమ్మున్న ఏకైక పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. 

కల్తీ పాలు బాధితులకు షర్మిల పరామర్శ:

ఇక ఈరోజు కల్తీ పాలు తాగిన ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను నేడు రాజమండ్రి ఆసుపత్రిలో షర్మిల పరామర్శించడం జరిగింది. వైద్యులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం  గురించి తెలుసుకొని, బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. విషంతో నిండిన త్రాగి 11 మంది మరణించగా, ఇంకా 9 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడటం చూస్తే, రాష్ట్రంలో కనీసం స్వచ్ఛమైన పాలు కూడా అందించడంలో నిఘా పెట్టలేని ప్రభుత్వం ఉంటే ఎంత ? ఊడితే ఎంత ? అని ఘాటుగా స్పందించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *