దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో నేటి ట్రేడింగ్ ముగించాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు మరియు ముడిచమురు ధరలు బ్యారెల్‌కు $100 మార్కును దాటడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ దాదాపు 1,352.74 పాయింట్లు నష్టపోయి 77,566.16 వద్ద ముగిసింది. ఒకానొక దశలో సెన్సెక్స్ 2,400 పాయింట్లకు పైగా నష్టపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 422.40 పాయింట్లు (1.73%) క్షీణించి 24,028.05 వద్ద స్థిరపడింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్-టైమ్ కనిష్ట స్థాయి ₹92.30 కు పడిపోయింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో షేర్లను విక్రయించడం మార్కెట్ పై ప్రభావం చూపింది. అయితే ఐటీ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. ఎల్టీఎం, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, కోఫోర్జ్, విప్రో షేర్లు లాభాలతో ముగిశాయి.