అరటి రైతులది అరణ్య రోదన:ఏపీసీసీ చీఫ్ షర్మిల

Spread the love

సిరులు కురిపించిన పంట నేడు రైతన్న కంట కన్నీరు పెట్టిస్తోందని ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అరటి రైతులది అరణ్య రోదన. ఆరుగాలం శ్రమిస్తే ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, దళారులు, అనుకొని యుద్ధాలు వంటి సమస్యలు అరటి రైతులను అష్టకష్టాల పాలు చేస్తున్నాయన్నారు.  ఎకరాకు 3 లక్షల వరకు పెట్టుబడి పోసి పంట తీస్తే, చేతికొచ్చిన సమయానికి టన్నుకు గిట్టుబాటు ధర కనీసం 15 వేలైనా లేకుంటే ఎలా ? అని ఆవేదన వ్యక్తం చేశారు. 3 వేలు , 4 వేలు ధర పెడితే పెట్టుబడి మందమైన రాక రైతన్న వ్యవసాయాన్ని చేయగలడా ? అని ప్రశ్నించారు. YSR కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం, సింహాద్రిపురం మండలం కస్నూరు గ్రామ పరిధిలో ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి పంటను షర్మిల పరిశీలించారు. ఈ సందర్భంగా అరటి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి కష్టాలు విని, కాంగ్రెస్ పార్టీ పక్షాన న్యాయం కోసం పోరాడుతామని, గిట్టుబాటు ధర కోసం ఉద్యమిస్తామని హామీ ఇచ్చారు. అరటి రైతుల కష్టాలపై YSR కడప జిల్లా పర్యటనలో భాగంగా నేడు ఇడుపుల పాయలో ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వై.ఎస్.ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *