వైసీపీలో కీలక నేతగా కొనసాగి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన త్వరలో ఒక మీడియా వేదికను తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రియమైన మిత్రులారా,త్వరలో మేము తెలుగు, హిందీ మరియు ఆంగ్ల భాషలలో ఒక డిజిటల్ మీడియా వార్తా వేదికను ప్రారంభించబోతున్నాము. ఈ వేదిక నిష్పక్షపాతంగా, సమతుల్యంగా మరియు నిఖార్సైన నిజానికి కట్టుబడి ఉంటుంది. సామాన్య ప్రజలు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు మరియు అణగారిన వర్గాల గొంతుకగా నిలవడమే మా లక్ష్యం. వారి నిజమైన సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే మా ప్రధాన ఉద్దేశ్యం. మా వేదిక పూర్తి స్వతంత్రంగా ఉంటుంది మరియు ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయదు. డిజిటల్ వేదిక విజయవంతమైన తర్వాత, ఇదే విలువలు మరియు ఆశయాలతో ఒక తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్‌ను కూడా ప్రారంభించాలని మేము యోచిస్తున్నాము.ఈ వేదిక పేరును త్వరలోనే ప్రకటిస్తాము. వేచి చూడండ అని ఆయన పేర్కొన్నారు.