ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి వై.ఎస్.విజయమ్మ మీడియాకు అడ్వకేట్ నోటరీ విడుదల చేశారు. ఈ మేరకు అందులో కీలక విషయాలు ప్రస్తావించారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే ఆస్తుల పంపకం ఎప్పుడు జరగ లేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుమలుకు సమానంగా పంచాలని వైఎస్సార్ ఉద్దేశ్యమని ఇది ఆయన ఆదేశం కూడా అని పేర్కొన్నారు.దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవమిదని MOUలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవేనని పేర్కొన్నారు. అందుకే జగన్ MOU రాశాడు (నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్ తో సహా MOUలో లేని యెలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే). ఆస్తులు విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగ లేదు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్సార్ జగన్ కు కూడా ఇచ్చారు. అది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకుకి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరు ఎవరు ? మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్లీ మళ్లీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నా, దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అంటూ ఆమె అందులో పేర్కొన్నారు.