నేటి నుండి జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదును భారీగా చేపడుతోంది. జనసేన ఉద్యమి సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాలు వివరిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసే దిశగా పిలుపునిస్తోంది. దేశవ్యాప్తంగా జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. జనసేన పార్టీ లో సభ్యత్వం తీసుకోవడం అంటే సమాజంలో మంచి వైపు నిలబడతారనే గౌరవాన్ని సంపాదించడమేనని జనసేన పేర్కొంది. వ్యవస్థలో మార్పు కోసం ఉద్యమించే వారే జనసేన ఉద్యమి అని తెలిపింది. సాధారణ కార్యకర్త నుండి నాయకులు అయ్యే అవకాశం కల్పన ఈ సభ్యత్వంతో సాధ్యమని రాజకీయ, సామాజిక అంశాలపై శిక్షణ పొందే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది. సభ్యత్వం ఉన్నవారికే పార్టీ కమిటీల్లో అవకాశంతో పాటు కుటుంబానికి భరోసా కల్పించేలా ప్రతీ ఉద్యమికి 75 లక్షల ప్రమాద జీవిత బీమా అందించనుంది. పార్టీ నిర్మాణం, రాజకీయం, గెలుపు ఇవన్నిటికన్నా పార్టీ కోసం నిలబడ్డ ప్రతీ కార్యకర్త కుటుంబ క్షేమాన్ని, వారికి ఇవ్వగలిగిన భరోసాని గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచించారని అందుకు నిదర్శనమే “జనసేన ఉద్యమి” సభ్యత్వ నమోదు కార్యక్రమమని స్పష్టం చేసింది.