కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ స్పందించారు. ప్రతిపక్ష పార్టీలు తమను తాము తీవ్రంగా ప్రశ్నించుకోవాలని అసలు తాము సాధించింది ఏమిటి? అని ప్రశ్నించారు. వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గేలా ఉంది, మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వాయిదా పడింది! అటు దక్షిణాదికి గానీ, ఇటు మహిళలకు గానీ న్యాయం జరగలేదు! ఒకవేళ 2026 జనాభా గణన గనుక జరిగితే, దక్షిణాది పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు. కుటుంబ నియంత్రణ విషయంలో క్రమశిక్షణతో వ్యవహరించినందుకు దక్షిణాది రాష్ట్రాలు మరింత శిక్షకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇక మహిళా బిల్లుకు వైసీపీ మద్దతునిచ్చింది.