MGNREGA కింద 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1192.16 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కాగా, దీనిపై సోషల్ మీడియా ‘ఎక్స్’ లో కేంద్ర మంత్రి పెమ్మసాని స్పందించారు. నిధులు మంజూరు చేయడం ఆనందకరమని అన్నారు. ఇందులో మెటీరియల్ కంపోనెంట్‌కు రూ. 1123.15 కోట్లు, అడ్మిన్ కంపోనెంట్‌కు రూ. 69.01 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులు గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంచి, మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడతాయన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ నిధులు ప్రతి గ్రామానికి చేరి, ఉపాధి, గౌరవం, అవకాశాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు.