
MLA Bandaru Sravani Sree: రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం.. కానీ సేవ్ టిడిపి అంటూ నినాదాలు.. ఎమ్మెల్యే వద్దు సీఎం చంద్రబాబు ముద్దు అంటూ ఫ్ల కార్డులు.. ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి అంటూ నిరసనలు.. ఎక్కడైనా అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు చేయడం చూసాం.. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే పై ఆ పార్టీ కార్యకర్తలే నిరసన చేయడం చూశారా.. నమ్మబుద్ధి కావడం లేదు కదా.. ఐతే.. ఈ స్టోరీ చూసేయండి…
అనంతపురం జిల్లా లో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం సింగనమల. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ముందు నుంచి గ్రూపు తగాదాలు పరిపాటిగా మారాయి. అధికారాన్ని చేపట్టి 15 నెలలు గడుస్తున్న సింగనమల నియోజకవర్గం లో మాత్రం ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీకి ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పోసకటం లేదంట.. నియోజకవర్గంలో ఏ పోస్టు కావాలన్నా ఆమ్యామ్య.. కావాల్సిందే అని టాక్.. శింగనమల మండలం సకలం చెరువు గ్రామం తెలుగుదేశం పార్టీ కార్యకర్త వద్ద ఒక పోస్ట్ కోసం ఎమ్మెల్యే అనుచరుడు డబ్బు గురించి చేసిన సంభాషణ వీడియో పార్ట్ 1 అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ మారింది..ఎమ్మెల్యే అనుచరుడు మాట్లాడిన వీడియో… లీక్ కావడంతో అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ ఐ.. ఇప్పుడే ఇదే జిల్లా లో హాట్ టాపిక్ అంటా….
సింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయసముద్రం మేజర్ పంచాయతీ.. ఇక్కడ సుమారుగా 22,000 ఓట్లు ఉన్నాయి.. ఈ పంచాయతీలో ఐదుగురు ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగం లో నెలకొన్న వివాదం.. రచ్చకెక్కింది.. ఎంతవరకు రచ్చకెక్కిందంటే ఏకంగా ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేసే వరకు వెళ్లింది.. గతంలో బుక్కరాయసముద్రం గ్రామ ప్రజలు ఐదుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేసేవారు.. వివిధ కారణాల ద్వారా ఆ ఐదుగురు ఫీల్డ్ అసిస్టెంట్లను ఎమ్మెల్యే బండారు శ్రావణ శ్రీ తొలగించిందనీ ఆరో పిస్తున్నారు..
అయితే వారిలో సురేష్ అనే వ్యక్తికి తిరిగి ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇచ్చారు. మిగతా వారిని పక్కనపెట్టి సురేష్ కు మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.. సురేష్ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు సమీప బంధువు అని అందుకే అతనికి పోస్టింగ్ ఇచ్చాడని స్థానికులు ఆరోపించారు. గత ఐదు సంవత్సరాలు పార్టీలో అనేక ఇబ్బందులు కేసులు పెట్టించుకుని పార్టీ కోసం కష్టపడితే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్ష పార్టీ నేతలకే ఎమ్మెల్యే పనులు చక్కబెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలే ముందుంటారని చెప్తారు.. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం కార్యకర్తలను కరివేపాకులా పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. MLA Bandaru Sravani Sree.
గతంలో కూడా సింగనమల నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ రెండు గ్రూపులుగా వ్యవహరించింది.. ఒకటి దిసభ్య కమిటీ ఆలం నరసానాయుడు, మొంటిమడుగు కేశవరెడ్డి ఆధ్వర్యంలో ఉన్న ఒక గ్రూపు… మరొకటి ఎమ్మెల్యే బండారు శ్రావణ శ్రీ గ్రూపు.. ఈ వివాదం కాస్త అధిష్టానం దృష్టికి కూడా వెళ్లి ముఖ్యమంత్రి దగ్గర పంచాయతీ కూడా జరిగింది.. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకున్న తరుణంలో మరొక్కసారి సింగనమల నియోజకవర్గంలో వర్గ విభేదాలు బయటపడ్డాయి.. ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలో ఇంత రాజకీయం చోటు చేసుకోవడం.. పవన్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది… దీంతో అక్కడున్న తెలుగుదేశం పార్టీ నిరసన కారులు ఎమ్మెల్యే డౌన్ డౌన్ ఎంపీ .. డౌన్ డౌన్ అంటూ సొంత పార్టీ కార్యకర్తలే రోడ్డు ఎక్కడంతో పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై పూర్తి వివరాలు సేకరించాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పళ్ళ శ్రీనివాసరావు అప్పగించారని టాక్.. చూడాలి మరి సింగనమల నియోజకవర్గం లో జరుగుతున్న వివాదంపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో…
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q