నారా లోకేష్ హామీ.. తిరుపతిలో కీలక  స్పోర్ట్స్ ఫెసిలిటీస్  

Spread the love

తిరుపతిని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామని తన  యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చిన నారా లోకేష్ తన హామీని నిలబెట్టుకున్నారు. ఈరోజు ఉదయం తిరుపతి పట్టణం గొల్లవానిగుంటలో శాప్, తుడా నిధులు రూ.10.10 కోట్లతో ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అకాడమీలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ అకాడమీలను లోకేష్ ప్రారంభించారు. ఇండియన్ ఉమెన్స్  క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ఇతర క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడారు.  తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో రూ.5.35 కోట్ల వ్యయంతో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ, 200 మంది క్రీడాకారులకు వసతి సదుపాయం నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన జూనియర్ బాక్సింగ్ రింగ్‌ను లోకేష్ ప్రారంభించారు. గూడూరు నియోజకవర్గం కోటలో రూ.2.31 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం, సూళ్లూరుపేటలో రూ.2.70 కోట్ల వ్యయంతో క్రీడా వికాస కేంద్రం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రేణిగుంట ఏపీఎస్టీఆర్ఈఐఎస్ పాఠశాలలో  లో రూ.80 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ క్రీడా వికాస సెంటర్ కు  మంత్రి శంకుస్థాపన చేశారు. క్రీడాకారులు, క్రీడా నిపుణుల అభిప్రాయాలు సేక‌రించి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని లోకేష్ వివరించారు.  రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై తిరుపతి స్పోర్ట్స్ స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులతో మంత్రి భేటీ అయ్యారు.  యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేర‌కు రాయలసీమ స్పోర్ట్స్ హబ్ త్వ‌రలో కార్య‌రూపం దాల్చుతుంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *