గిరి పుత్రుల మధ్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన జనసేనాని పవన్ 

Spread the love

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పర్యటిస్తున్నారు. పాడేరు వద్ద గిరిజన గ్రామాల్లో ‘అడవితల్లి బాట’ రోడ్లను పరిశీలించారు. నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాడేరు నియోజక వర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరి పుత్రుల మధ్య పార్టీ పతాకాన్ని పవన్ ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస రావు, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య తదితరులు హాజరయ్యారు. ఇక ఈ పర్యటనలో భాగంగా మాట – మంతి కార్యక్రమంలో పాల్గొని, అభివృద్ధి కార్యక్రమాలను  ప్రారంభించారు. చిన్నారులతో ఫోటోలు దిగారు. స్థానిక పాఠశాలలో చిన్నారులతో ముచ్చటించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *