రజనీ సీన్ రివర్స్…!

Spread the love

Rajini Palnadu District Consequences: మాజీ మంత్రి రజనీ సీన్ రివర్స్. అనుకున్నది ఒక్కటీ.. జరుగుతోంది మరొకటి. ఇప్పటి వరకు తనకు తిరుగు లేదని భావించిన రజనీకి సొంత పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. వైసీపీ అధినాయకత్వం వద్ద పలుకుబడితో ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణికి స్థానిక కేడర్ చెక్ పెట్టారు. రజనీ పైన బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రజనీ వద్దు.. జగన్ ముద్దు నినాదం తెర మీదకు తెచ్చారు. దీంతో.. ఇప్పుడు రజనీకి దిక్కు తోచటం లేదు. ముందు నుయ్యి .. వెనుక గొయ్యి అన్నట్లుగా పరిస్థితి మారింది….

వైసీపీ నేత.. మాజీ మంత్రి రజనీ ధోరణితో సొంత పార్టీలోనే అసంతృప్తి మొదలైంది. మంత్రిగా ఉన్న సమయంలో తన పీఏలు.. కుటుంబ సభ్యులతో రజనీ శైలితో చాలా మంది ఇబ్బందులు పడ్డారు…. క్రషర్ వ్యాపారుల నుంచి అనేక మందిని వేధించారు. కోట్లాది రూపాయాలు వసూలు చేసారనే అభియోగాలు ఉన్నాయి…. కేసులు నమోదయ్యాయి. 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిన రజనీ తిరిగి చిలకలూరి పేటకు వచ్చారు…..నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు…. అయితే, అప్పటికీ.. ఇప్పటికీ పరిస్థితుల్లో పూర్తి మార్పు వచ్చింది. కేడర్ ఏ మాత్రం రజనీ నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితి లేదు. రజనీ తీరు పైన పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు చేసారు…..

వైవీ సుబ్బారెడ్డి, గౌతం రెడ్డికి స్థానిక నేతలు ఆధారాలతో ఫిర్యాదులు చేసారు…. కాగా, తాము పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ కేడర్ పైనే కేసులు పెట్టటం పైన వారు మండిపడుతున్నారు. ఈ నెల 17న నియోజకవర్గ కార్యకర్తలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రజనీ నాయకత్వంలో పని చేసేందుకు తాము సిద్దంగా లేమని తేల్చి చెబుతున్నారు. జగన్ ముద్దు.. రజనీ వద్దు అనే నినాదం తో ఏకగ్రీవ తీర్మానం చేసి పార్టీ నాయకత్వానికి పంపాలని డిసైడ్ అయ్యారు. తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి….‌ జగన్ ముద్దు.. రజనీ వద్దు నినాదంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పార్టీ శ్రేణులు ఒక విధంగా రజనీ పైన తిరుగుబాటు చేసాయి….. Rajini Palnadu District Consequences.

దీంతో, వ్యతిరేకిస్తున్న వారిని పార్టీ వ్యతిరేకులు సస్పెండ్ చేసారు…. దీనిని కొందరు నేతలు ఓపెన్ గా వ్యతిరేకిస్తున్నారు. రజనీ వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చిలకలూరిపేటలో రజనీ అనుకూల – వ్యతిరేక వర్గాలుగా పార్టీ కేడర్ చీలిపోయింది. ఈ నెల 17న జరిగే సమావేశంలో పార్టీ కేడర్ తీసుకునే నిర్ణయం పైన నియోజకవర్గంలో పార్టీ.. రజనీ భవిష్యత్ పైన స్పష్టత రానుంది. అయితే.. రజనీ పైన చర్యలు తీసుకోకుంటే.. తాము పార్టీ వీడేందుకు సిద్దమని కేడర్ హెచ్చరిస్తోంది. దీంతో, రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది..!

Also Read: https://mega9tv.com/andhara-pradesh/vigilance-investigation-into-aadudam-andhra-program-concludes-reveals-massive-corruption/