
Nellore Minister: సహజంగా ఒక జిల్లా నుండి మంత్రి పదవి ఆశించే వాళ్ళు ఒకరు లేదా ఇద్దరు ఉంటారు. కానీ ఆ జిల్లాలో మాత్రం ఆరడజను మంది మంత్రి పదవిని ఆశిస్తున్నారు… ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా తమకు మంత్రి పదవి వస్తుందా అని కొండంత ఆశగా ఎదురుచూస్తున్నారు… ప్రభుత్వ కార్యక్రమాలను ఒకరు ప్రజల్లోకి స్పీడ్ గా తీసుకుపోతుంటే.. మరొకరు సొంత డబ్బును సైతం వెచ్చించే భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.. మరొకరేమో సీనియారిటీ ప్రకారం మొదటి నుండి కూడా పార్టీని నమ్ముకున్నాను కాబట్టి తనకే మంత్రి పదవి వస్తుందని ఆశతో ఉన్నారు… మరో ముగ్గురు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇంతకీ ఆ జిల్లా పేరేమిటి? ఆ అరడజను నాయకుల పేర్లు ఏమిటి… తెలుసుకోవాలనుకుంటే వాచ్ థిస్ స్టోరీ..
పెద్దారెడ్డిలకు పెట్టింది పేరుగా చెప్పుకునే నెల్లూరు జిల్లాలో త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కోసం దాదాపు అరడజను మంది క్యూలో ఉన్నారంట… ముఖ్యంగా గత వైసిపి ప్రభుత్వం లో 16 నెలలు అధికారాన్ని వదులుకొని తెలుగుదేశం పార్టీలో చేరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే పార్టీలో మొదటి నుండి కూడా ఉంటూ కష్టాలు, సుఖాలు పట్టించుకోకుండా ఇతర పార్టీలలోకి జంపు చేయకుండా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రి పదవిని ఆశిస్తుండగా సేవా దృక్పథం కలిగి ఎలాంటి పదవులు లేనప్పుడు కూడా ప్రతి ఒక్కరుకి సహాయ సహకారాలు అందిస్తూ మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి రికార్డు మెజారిటీతో గెలిచిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మంత్రి పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది…
అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గూడూరు.. సులూరుపేట ఎమ్మెల్యేలు పాశం సునీల్…విజయ శ్రీ కూడా మంత్రి పదవి రేసులో ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం…
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నెల్లూరు జిల్లాలో అటు పొంగూరు నారాయణ ఇటు ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరు కూడా మంత్రి పదవులు దక్కించుకున్న విషయం తెలిసిందే… అయితే త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఒకరిపై వేటువేసి కొత్తవారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే అధిష్టానం ఎవరిపైన వేటు వేస్తుందో తెలియదు కానీ ఆశావాహులు మాత్రం అరడజను వరకు లైన్లో ఉండటం విశేషం.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి… గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్.. సులూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విజయశ్రీ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఎస్సీ సామాజిక వర్గానికి పెద్దపేట వేయాలనుకుంటే కచ్చితంగా పాశం సునీల్ కుమార్ లేదా మహిళా కోటాలో విజయశ్రీ కి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంత్రి పదవి రేసులో లేనప్పటికీ వాళ్లు వంతు ప్రయత్నాలు కూడా జోరుగా కొనసాగిస్తున్నట్లు ఆ నోట ఈ నోట వినిపిస్తుంది..
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా తన సొంత నిధులు సైతం వెచ్చించి కావలీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు అలాగే కావలి చరిత్రలో ఎవరో గెలవని రికార్డు మెజారిటీతో గెలిచారు కాబట్టి చంద్రబాబు నాయుడు మనసులో కావ్య కృష్ణారెడ్డి పేరు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణ జరిగితే కావ్య కృష్ణారెడ్డికి కూడా కచ్చితంగా అవకాశాలు ఉన్నాయని సమాచారం…
ముఖ్యంగా కోటం శ్రీధర్ రెడ్డి… సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి… వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి… కావ్య కృష్ణారెడ్డి మద్యే ప్రధానమైన పోటీ నెలకొందని ప్రతి నోటా వినిపిస్తుంది.
శ్రీధర్ రెడ్డి..సోమిరెడ్డి..ప్రశాంతి రెడ్డి ముగ్గురిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఆల్రెడీ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ప్లస్ పాయింట్ అవుతుందని సమాచారం..అయితే వైసీపీలో 16 నెలలు అధికారం ఉన్నప్పటికీ జగన్ అండ్ టీం తో విభేదించి టిడిపిలో చేరిన శ్రీధర్ రెడ్డి కి కూడా అప్పట్లోనే చంద్రబాబు నాయుడు.. యువనేత లోకేష్ మంత్రి పదవి ఇస్తాము అని మాట ఇచ్చినట్లు ప్రతి నోటా వినిపిస్తుంది..ఇక వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి..వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయంలో లేనప్పుడే సేవా కార్యక్రమాలు చేస్తూ జిల్లాలో ప్రతి ఒక్కరు మనసు దోచుకున్నారు అని చెప్పుకోవచ్చు.. మొదటి నుండి కూడా సేవా దృక్పథంతో పది మందికి సేవ చేసే మనసున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు పుష్పలంగా కనిపిస్తున్నాయి.. కోవూరు నియోజకవర్గంలో రికార్డు మెజారిటీతో గెలిచారు కూడా..
పైగా నెల్లూరు జిల్లాలో అప్పట్లో నేదురుమల్లి రాజ్యలక్ష్మి తరువాత మరో మహిళ మంత్రి పదవి చేపట్టిన దాఖలాలు లేవు. దీంతో మహిళా కోటాలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి కచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. Nellore Minister.
పైగా సేవా దృక్పథం పెద్ద ప్లస్ పాయింట్ గా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కలిసొస్తుందని తెలుస్తుంది..మరి త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వరిస్తుందా లేక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని వరిస్తుందా.. కావ్య కృష్ణారెడ్డినీ వరిస్తుందా..మహిళా కోటాలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని వరుస్తుందా అలాగే ఎస్సీ కోటాలో పాశం సునీల్ లేదా విజయశ్రీ లలో ఒకరిని అదృష్టం వరిస్తుందా వేచి చూడాలి మరి…..