హిందీ చలన చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు సంజయ్ దత్ ఏపీ సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సంజయ్ దత్ వివరించారు. సినిమా షూటింగ్లకు ఏపీని కేంద్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు, ఉన్న అవకాశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఫిలిం స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నాయని సీఎం తెలిపారు. ఇక గత నెలలో సంజయ్ దత్ మంత్రి నారా లోకేష్ తో కూడా సమావేశమైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి వీరి సమావేశంలో చర్చించారు.