సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ 59వ సమావేశం జరిగింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, జీవోఎంల నిర్ణయాలు, సచివాలయం, హెచ్వోడీ భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. ఈపీసీ పద్దతిన తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటుపై సమీక్షరాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై చర్చించారు. వివిధ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించుకునేలా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు గురించి సమావేశంలో చర్చించారు. ఈ భేటీలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సీఎస్ సాయి ప్రసాద్, పట్టణాభివృద్ధి, సీఆర్డీఏ, ఏడీసీఎల్ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.