ఆగిపోలేదు..మొదలైంది!నో హీరోయిన్..నో రొమాన్స్!బన్నీ కెరీర్లోనే అతిపెద్ద ప్రయోగంగా AA23?
రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇచ్చిన ఒక హింట్ బన్నీ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.

పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయికి వెళ్లిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రాకా అనే భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా కంటే ముందే, ఈ ఏడాది జనవరిలో బన్నీ 23వ సినిమా పై ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయబోతున్నట్లు వచ్చిన ఆ ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ ఆ తర్వాత దీనిపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో.. సినిమా ఆగిపోయిందంటూ రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇచ్చిన ఒక హింట్ బన్నీ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. జనవరిలో వచ్చిన AA23 అనౌన్స్మెంట్ వీడియో అప్పట్లో ఆన్లైన్లో ఒక పెద్ద సెన్సేషన్. ఆ చిన్న క్లిప్ చూసి ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా మిలియన్ కు పైగా రీల్స్ క్రియేట్ అయ్యాయి. ఆ స్థాయి బజ్ క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ గురించి ఆ తర్వాత మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీనికి తోడు లోకేష్ కనగరాజ్ వేరే ప్రాజెక్టుల్లో బిజీ అవ్వడం.. బన్నీ ఏమో అట్లీతో రాకా మూవీ షూటింగ్ కు వెళ్లిపోవడంతో, ఈ కాంబినేషన్ క్యాన్సిల్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. బహుశా స్టోరీ సెట్ అవ్వలేదేమో, లేదా డేట్స్ అడ్జస్ట్ కాక ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారేమో అని ట్రేడ్ వర్గాల్లో కూడా జోరుగా చర్చ జరిగింది. కానీ, ఈ రూమర్లలో ఎలాంటి నిజం లేదని, ప్రాజెక్ట్ ఆన్ ట్రాక్ లోనే ఉందని తాజాగా తేలిపోయింది.



